BREAKING
రవిప్రకాష్‌కు కీర్తి పురస్కారం స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించిన కేఎల్ఆర్ మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ఉద్యాన పంటలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం గ్రామసభలో విద్యార్థుల గళం నాలుగు అడుగుల ముసలి కలకలం..! ఎల్‌నినోపై విద్యార్థుల ర్యాలీ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి లోకేష్ ఘనస్వాగతం అందుబాటు ధరల్లో క్యాన్సర్ మందులు: రోగుల ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం – శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా *నారాయణ బెస్ట్ ఫౌండేషన్ స్కూల్ లో ఘనంగా బాలోత్సవ వేడుకలు..* APRS సంతనూతలపాడు పాఠశాలకు ప్రశంశాపత్రం విట్లంపల్లి తాగునీటికి శాశ్వత పరిష్కారం.. లక్ష డిజిటల్ ఎంఎస్ఎంఈల తయారీకి 50 కేంద్రాలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రూఫ్‌టాప్ సోలార్‌లో ఏపీ దేశానికే ఆదర్శం: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపికి తుఫాన్ ముప్పు! స్వర్ణ,డా. ప్రవీణ్ కుమార్ వివాహ రెసెప్షన్ కు హాజరైన పారిశ్రామిక వేత్త శిద్దా సుధీర్ కుమార్

సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో గంజాయిపై ఉక్కుపాదం**గడిచిన ఏడాదిలో 20 మందిని అరెస్టు చేశాం*

Select Suryaa Now
సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో గంజాయిపై ఉక్కుపాదం**గడిచిన ఏడాదిలో 20 మందిని అరెస్టు చేశాం*

అశ్వారావుపేట మండల ప్రజలకు ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. వివరాల్లోకి వెళితే అశ్వారావుపేట మండల ప్రాంతంలో గడిచిన సంవత్సర కాలంలో 20 మందిని గంజాయి కేసుల్లో అరెస్టు చేయడం జరిగింది.ఇంట్లో గంజాయి వాడేవారిని, మధ్యవర్తులుగా తిరిగేవారిని, అమ్మేవారిని కూడా అరెస్టు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.అశ్వారావుపేట మండలంలో పాకాలగూడెం గ్రామంలో గంజాయి చెట్లను కూడా పెంచడం జరిగిందని, వారిని కూడా అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగిందని ఎస్ హెచ్ ఓ తెలిపారు.

దీనిపై యుద్ధ ప్రాతిపదికన, జిల్లా పోలీస్ ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల ప్రకారం గ్రామాలను చుట్టుముట్టి తనిఖీలు కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.

ఇప్పటి నుంచి ప్రతి నెలలో కూడా నాలుగైదు గ్రామాలలో గ్రామాలను చుట్టుముట్టి తనిఖీలు నిర్వహించి, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.గంజాయి, కోడిపందాలు, పేకాట ఆడేవారిని, నిర్వహించేవారిని, పాల్గొనేవారిని ఉక్కుపాదంతో అణిచివేసే కార్యక్రమం చేపడతామని అధికారి సాయి కిషోర్ రెడ్డి తెలిపారు.

సూర్య ఆర్ సి ఇంచార్జ్ మునీర్ అశ్వరావుపేట