రోడ్లపైనే దుకాణాలు.. బస్సులు! నేరేడుచర్లలో నరకప్రాయంగా ట్రాఫిక్ కష్టాలు ప్రమాదాలు జరిగినా మారని పరిస్థితి ఫుట్‌పాత్‌లు, రహదారుల ఆక్రమణతో వాహనదారులకు అవస్థలు బస్టాండ్ ఉన్నా రోడ్డుపైనే ఆర్టీసీ బస్సుల నిలుపుదల అత్యవసర సమావేశం నిర్వహించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజల డిమాండ్
రోడ్లపైనే దుకాణాలు.. బస్సులు!
నేరేడుచర్లలో నరకప్రాయంగా ట్రాఫిక్ కష్టాలు
ప్రమాదాలు జరిగినా మారని పరిస్థితి
ఫుట్‌పాత్‌లు, రహదారుల ఆక్రమణతో వాహనదారులకు అవస్థలు
బస్టాండ్ ఉన్నా రోడ్డుపైనే ఆర్టీసీ బస్సుల నిలుపుదల
అత్యవసర సమావేశం నిర్వహించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజల డిమాండ్
నేరేడుచర్ల మేజర్ న్యూస్
నేరేడుచర్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్య ప్రజలకు నిత్య నరకంగా మారింది. నాలుగు రోడ్ల కూడలి వద్ద వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఫుట్‌పాత్‌లు, రహదారులను ఆక్రమించి దుకాణాలు, బండ్లపై వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు బస్టాండ్ ఉన్నప్పటికీ ఆర్టీసీ బస్సులను రోడ్డుపైనే నిలుపుతుండటంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉంది.ఇటీవల రహదారిపై ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ప్రమాదం జరిగి ప్రాణనష్టం చోటుచేసుకున్నా ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌ఐ గోపాల్ రెడ్డి గేట్లు ఏర్పాటు చేయడంతో కొంతమేర ఉపశమనం లభించినా, రోడ్ల ఆక్రమణలు, అడ్డదిడ్డమైన బైక్ పార్కింగ్, బస్సుల నిలుపుదల కొనసాగుతూనే ఉన్నాయి.మున్సిపల్ అధికారులు తక్షణమే అత్యవసర సమావేశం నిర్వహించి రహదారి ఆక్రమణలు తొలగించాలని, రోడ్డుపై ఆర్టీసీ బస్సుల నిలుపుదలను నియంత్రించాలని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు శాశ్వత చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరో ప్రాణం బలికాకముందే అధికారులు స్పందించాలని కోరుతున్నారు.