BREAKING
హెచ్‌ఐవి /ఎయిడ్స్ సమీక్ష సమావేశం ఫార్మా డి, లా పరీక్ష ఫలితాలు విడుదల కూటమి తరపున తల్లి, కూతుర్లు విజయం ఎయిమ్స్‌(ఇనిసెట్‌) పీజీ ప్రవేశ పరీక్షల్లో శ్రీప్రజ్ఞ ప్రతిభ ఓయన్ కొత్తూరులో టీడీపీ విజయకేతనం ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకుల దుర్మరణం మేకపాటి కోటలో ఎగిరిన పసుపు జెండా ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు టీడీపీ కైవసం వైభవంగా పైడితల్లి అమ్మవారి కలశజ్యోతుల ఊరేగింపు వెల్దుర్తి జడ్పిటిసి తెదేపా అభ్యర్థి శైలజ సుబ్బరాయుడు ఘనవిజయం రామభద్రపురం మండలం తెలుగుదేశం పార్టీ హవా ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి జాతీయస్థాయిలో గుర్తింపు. జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లా వాసులకు బంగారు, వెండి పథకాలు నాకాఫ్ టెండర్‌ను రద్దు చేయాలి- ఐక్య విద్యార్థి సంఘాలు ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అభివృద్ధి వెలుగులు నిండాలి లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం.. భార్యకు తీవ్ర గాయాలు

రిక్వెస్ట్‌ బస్‌స్టాప్‌లో బస్సులు ఆపాలి - శ్యాంరావ్

Select Suryaa Now
రిక్వెస్ట్‌ బస్‌స్టాప్‌లో బస్సులు ఆపాలి - శ్యాంరావ్
సూర్య,కాగజ్‌నగర్‌:  కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నవేగాం, రాళ్లపేట గ్రామాల మధ్య ఉన్న రిక్వెస్ట్‌ బస్‌స్టాప్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కె.వి.పి.ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బోర్కుటే శ్యాంరావ్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఈ బస్‌స్టాప్‌లో మహిళలను ఎక్కించుకోవడం, దింపడం లేదని ఆరోపించారు.
దీంతో మహిళలు, వృద్ధులు, అత్యవసర పనులపై రెబ్బెన, ఆసిఫాబాద్, మంచిర్యాల, కాగజ్నగర్ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం వేచి చూడాల్సి వస్తోందన్నారు. గ్రామానికి రిక్వెస్ట్‌ బస్‌స్టాప్‌ ఉన్నప్పటికీ బస్సులు ఎందుకు ఆపడం లేదని ఆర్టీసీ అధికారులను ప్రశ్నించారు.సంబంధిత డిపో అధికారులు వెంటనే స్పందించి నవేగాం, రాళ్లపేట రిక్వెస్ట్‌ బస్‌స్టాప్‌లో నిబంధనల ప్రకారం అన్ని ఆర్టీసీ బస్సులు ఆగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, వృద్ధుల రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోచయ్య పాల్గొన్నారు.