BREAKING
పులివెందుల మున్సిపాలిటీలో బార్లు తీరిన ఓటర్లు... ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన పోలింగ్ ఎంపీటీసీలు ఏకగ్రీవం సరే.. జడ్పిటిసి ఓట్లు ఎలా ? చేనేతపురంలో చేనేత బిడ్డ ఓటేసింది ‘చలో ఢిల్లీ’కి సర్వం సిద్ధం: లోక్‌సభ ఎల్‌ఓపీ రాహుల్ గాంధీ నివాసం వద్ద హై అలర్ట్ బద్వేల్ లో మొదలైన మున్సిపల్ వార్డు పోలింగ్ చరిత్రలోనే అతిపెద్ద క్రిప్టో చోరీ: కిమ్ సర్కార్‌పై ఎఫ్‌బీఐ తీవ్ర ఆరోపణలు చలో రామ్‌లీలా మైదాన్: టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ నివాసం వద్ద విజువల్స్ వైరల్ డైమండ్ జూబ్లీ ఇయర్‌లో హర్యానా: ప్రగతిపథంలో రాష్ట్రం దూసుకుపోతోందన్న సైనీ రాజాపూరం ఎస్సీ కాలనీలో క్షుద్ర పూజలు.. బియ్యం ధరల దోపిడీకి చెక్.. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు: జిల్లా అదనపు కలెక్టర్ డి.విజయేందర్ రెడ్డి ఫార్మా రంగానికి డిజిటల్ బూస్ట్: ఈఆర్పీ వ్యవస్థలతో తయారీ మరింత వేగవంతం వెల్దుర్తి శ్రీ ఎల్లమ్మ అమ్మవారికి కిలో గ్రాము బంగారు కిరీటం సమర్పణ రెయిన్‌బో మెడికేర్ లాభాల పంట: క్యూ2లో ₹83.89 కోట్ల నికర లాభం ఓటుహక్కు వినియోగించుకున్న జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థి నరేంద్రుల వినీత గ్రామీణాభివృద్ధిలో విశేష కృషి.. 5వ రోహిణి నయ్యర్ పురస్కారాన్ని దక్కించుకున్న టెక్ విద్యావేత్త ప్రశాంత్ చౌదరి!

రాజాపూరం ఎస్సీ కాలనీలో క్షుద్ర పూజలు..

Select Suryaa Now
రాజాపూరం ఎస్సీ కాలనీలో క్షుద్ర పూజలు..

రాజాపురం ఎస్సీ కాలనీలో క్షుద్ర పూజలు...
- చిన్నపిల్లల్లో భయాందోళన...
- మూఢనమ్మకాలతో సొమ్ము చేసుకుంటున్న కేటుగాళ్లు... 
- పోలీసులు నిగా పెంచి, కేటుగాలపై చర్యలు తీసుకోవాలని గ్రామవాసుల విజ్ఞప్తి.. 
ఆధునిక కాలంలో సైన్స్ అంతరిక్షంలో జీవించే ప్రయోగాలు చేస్తుంటే ఇంకా కొందరు కేటుగాళ్లు క్షుద్ర పూజలు మూఢనమ్మకాల పేరుతో సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని రాజాపురం ఎస్సీ కాలనీ సిసి రోడ్లో గుర్తుతెలియని వ్యక్తులు మట్టి బొమ్మలు, ముగ్గులు, నిమ్మకాయలు పెట్టి, క్షుద్ర పూజలు చేయడం కలకలం రేపింది. ఆదివారం ఉదయం నిద్ర లేవగానే రోడ్డు మధ్యలో ఇలాంటి వస్తువులు కనిపించడంతో కాలనీవాసులు ముఖ్యంగా చిన్నపిల్లలు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. స్కూల్ కి వెళ్లే పిల్లలు మహిళలు బయటకు రావడానికి భయపడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చదువుకున్న వారు కూడా ఇలాంటి చేష్టలతో నిరక్ష రాస్యులను  మోసం చేస్తూ భయపెట్టి సొమ్ములు వసూలు చేసి విలాసాలు అనుభవిస్తున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇలాంటివి గురువారాలు, ఆదివారాలు, అమావాస్య రోజునే మూడు రోడ్ల మధ్యలో కనిపించేయి, కానీ ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు రోడ్డు మధ్యలో దర్శనమివ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. 
ఆధునిక కాలంలో సైన్సు విద్యతో ముందుకు వెళ్లవలసిన ఈ రోజుల్లో ఇంకా మట్టి బొమ్మలను, నిమ్మకాయలతో ప్రజలను భయపెట్టడం సిగ్గుచేటని మేధావులు అంటున్నారు.

పోలీసులకు విజ్ఞప్తి :- ఇలాంటి మూఢనమ్మకాలను ప్రోత్సహించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, రాత్రి వేళల్లో గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు. రోడ్డు సెంటర్లో ఇలాంటి వస్తువులు పెట్టే వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.

 

సూర్య ప్రతినిధి,అన్నపురెడ్డిపల్లి మండలం, చందు..