BREAKING
పులివెందుల మున్సిపాలిటీలో బార్లు తీరిన ఓటర్లు... ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన పోలింగ్ ఎంపీటీసీలు ఏకగ్రీవం సరే.. జడ్పిటిసి ఓట్లు ఎలా ? చేనేతపురంలో చేనేత బిడ్డ ఓటేసింది ‘చలో ఢిల్లీ’కి సర్వం సిద్ధం: లోక్‌సభ ఎల్‌ఓపీ రాహుల్ గాంధీ నివాసం వద్ద హై అలర్ట్ బద్వేల్ లో మొదలైన మున్సిపల్ వార్డు పోలింగ్ చరిత్రలోనే అతిపెద్ద క్రిప్టో చోరీ: కిమ్ సర్కార్‌పై ఎఫ్‌బీఐ తీవ్ర ఆరోపణలు చలో రామ్‌లీలా మైదాన్: టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ నివాసం వద్ద విజువల్స్ వైరల్ డైమండ్ జూబ్లీ ఇయర్‌లో హర్యానా: ప్రగతిపథంలో రాష్ట్రం దూసుకుపోతోందన్న సైనీ రాజాపూరం ఎస్సీ కాలనీలో క్షుద్ర పూజలు.. బియ్యం ధరల దోపిడీకి చెక్.. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు: జిల్లా అదనపు కలెక్టర్ డి.విజయేందర్ రెడ్డి ఫార్మా రంగానికి డిజిటల్ బూస్ట్: ఈఆర్పీ వ్యవస్థలతో తయారీ మరింత వేగవంతం వెల్దుర్తి శ్రీ ఎల్లమ్మ అమ్మవారికి కిలో గ్రాము బంగారు కిరీటం సమర్పణ రెయిన్‌బో మెడికేర్ లాభాల పంట: క్యూ2లో ₹83.89 కోట్ల నికర లాభం ఓటుహక్కు వినియోగించుకున్న జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థి నరేంద్రుల వినీత గ్రామీణాభివృద్ధిలో విశేష కృషి.. 5వ రోహిణి నయ్యర్ పురస్కారాన్ని దక్కించుకున్న టెక్ విద్యావేత్త ప్రశాంత్ చౌదరి!

చరిత్రలోనే అతిపెద్ద క్రిప్టో చోరీ: కిమ్ సర్కార్‌పై ఎఫ్‌బీఐ తీవ్ర ఆరోపణలు

Select Suryaa Now
చరిత్రలోనే అతిపెద్ద క్రిప్టో చోరీ: కిమ్ సర్కార్‌పై ఎఫ్‌బీఐ తీవ్ర ఆరోపణలు

సూర్య ఇంటర్నేషనల్ బిజినెస్ బ్యూరో, వాషింగ్టన్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ ‘బైనాన్స్’ పై జరిగిన 6 బిలియన్ డాలర్లకు (దాదాపు ₹50,000 కోట్ల పైమాటే) పైగా విలువైన డిజిటల్ ఆస్తుల భారీ దోపిడీ వెనుక ఉత్తర కొరియా హ్యాకర్లు ఉన్నారని అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్  అధికారికంగా ధ్రువీకరించింది. ప్రపంచ వర్చువల్ అసెట్ చరిత్రలోనే అత్యంత భారీ సైబర్ దోపిడీగా నమోదైన ఈ వ్యవహారంపై ఎఫ్‌బీఐ అత్యవసర హెచ్చరికలను జారీ చేసింది.

దోపిడీ చేసిన నిధులను హ్యాకర్లు వేగంగా ఈథరియం క్రిప్టోగా మారుస్తున్నారని, వాటి మూలాలను దాచేందుకు డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ (DeFi) ప్లాట్‌ఫామ్‌లు, ఇన్‌స్టంట్-స్వాప్ సేవల ద్వారా నిధులను దారి మళ్లిస్తున్నారని ఎఫ్‌బీఐ తెలిపింది. అంతర్జాతీయ ఏజెన్సీలు, క్రిప్టో సంస్థలు ట్రాక్ చేయకుండా ఉండేందుకు అత్యాధునిక మనీలాండరింగ్ మార్గాలను వినియోగిస్తున్నట్లు హెచ్చరించింది. అణ్వాయుధ, క్షిపణి ప్రాజెక్టులకు నిధుల సమీకరణ కోసమే కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం క్రిప్టో దోపిడీలకు పాల్పడుతోందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

క్రిప్టో ఎక్స్ఛేంజ్‌లు, డీఫై ప్లాట్‌ఫామ్‌లు, ఫైనాన్షియల్ సంస్థలు ఈ అనుమానాస్పద లావాదేవీలను నిరంతరం పర్యవేక్షించాలని, హ్యాకర్లతో సంబంధమున్న వాలెట్ చిరునామాలపై నిఘా ఉంచి వాటిని తక్షణమే స్తంభింపజేయాలని ఎఫ్‌బీఐ పిలుపునిచ్చింది.