చేనేతపురంలో చేనేత బిడ్డ ఓటేసింది
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా చేనేతపురం ఎమ్మిగనూరులో కర్నూల్ పార్లమెంట్ మాజీ సభ్యురాలు బుట్టా రేణుక తన ఓటు హక్కును 26వ వార్డులో వినియోగించుకున్నారు. ఆమెతో పాటు ఆమె భర్త బుట్ట ఫౌండేషన్ అధినేత బుట్టా నీలకంఠ కూడా ఓటు వేసుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ బుట్టా రేణుకను 26 కౌన్సిలర్ అభ్యర్థి సుభద్రమ్మ భర్త టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ పోలీస్ స్టేషన్ దగ్గర సైకిల్ కి ఓటు వేయమని కోరడం కోసమేరుపు.. ప్రతి ఓటరు మనకు రాజ్యాంగం కలిపించిన ఓటు హక్కు సద్వినియోగం చేసుకొని.. ఎవరైతే అబవృధి చేస్తారా అని అలోచించి ఓటు వెయ్యాలి అన్నారు బుట్టారేణుక..
A. R. శరత్ కుమార్
సూర్య ప్రతినిధి
ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా