BREAKING
మాజీ లాయర్ అలినా హబ్బా 50 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్‌పై ట్రంప్ ఆగ్రహం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అత్యాధునిక ఎంఆర్ఐ సేవలు! ఓటు హక్కును వినియోగించుకున్న బీవీ దంపతులు Weekly Horoscope (వార ఫలాలు) 01 Nov 2026 - 07 Nov 2026 వరకు by Dr Edupuganti Padmaja Rani అర్నాబ్ తుఫాన్ ప్రభావం: పశ్చిమగోదావరి జిల్లాలో పంట నష్టాలు – రైతులను ఆదుకోవాలని డిమాండ్ మార్షల్ ఆర్ట్స్‌తో ఆత్మరక్షణ, క్రమశిక్షణ అలవడతాయి ** కరస్పాండెంట్ బైరు కొండల్ రెడ్డి చీరాలలోని 88 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు ప్రారంభం విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మానసిక ధైర్యం, భద్రతపై భరోసా కల్పించేలా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చర్యలు నవంబర్ 28న నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష.. హాల్‌టికెట్లు విడుదల కదిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దంపతులు ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్: ఓల్డ్ టౌన్ లో ఓటర్ల ఉత్సాహం తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ స్పాట్ అడ్మిషన్లు 10 కోర్సుల్లో 378 ఖాళీ సీట్లు.. నవంబర్ 7న ప్రవేశాల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలు

ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్

Select Suryaa Now
ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : నగరంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతోందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి 43వ డివిజన్లోని ఝాన్సీ లక్ష్మీబాయి పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

​ఈ సందర్భంగా పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్న మంత్రి సత్య కుమార్ గారితో కలిసి ఎమ్మెల్యే దగ్గుపాటి ఓటింగ్ సరళిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... నగరంలోని 62 డివిజన్లలో ఎలాంటి అలజడులు లేకుండా, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునేలా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారని తెలిపారు.

​గత ఎన్నికల దౌర్జన్యాలకు స్వస్తి

2021 స్థానిక ఎన్నికల్లో గత ప్రభుత్వం దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి 85% స్థానాలను ఏకగ్రీవం చేసుకుందని ఎమ్మెల్యే మండిపడ్డారు. నాటి భయానక పరిస్థితులు ఈరోజు నగరంలో ఎక్కడా లేవని స్పష్టం చేశారు.

​నిష్పక్షపాతంగా ఎన్నికలు

కూటమి ప్రభుత్వంలో బెదిరింపుల సంస్కృతికి తావులేదని, ఎన్నికలను పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలనేదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృఢ సంకల్పమని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు, యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాయని కొనియాడారు. ప్రజలందరూ ఎలాంటి భయాందోళనలు లేకుండా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నగరంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న వాస్తవ ప్రగతిని చూసి ప్రజలు ఓటు వేస్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్.