ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్: ఓల్డ్ టౌన్ లో ఓటర్ల ఉత్సాహం
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : నగరంలోని ఓల్డ్ టౌన్ ప్రాంతంలో పోలింగ్ ప్రక్రియ ఆదివారం ఉదయం ప్రశాంతమైన వాతావరణంలో ప్రారంభమైంది. అక్కడి వాల్మీకి నగర పాలక ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపారు.
ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రమశిక్షణతో క్యూ లైన్లలో నిలబడి ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ సజావుగా సాగుతోంది.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్.