వెల్దుర్తి శ్రీ ఎల్లమ్మ అమ్మవారికి కిలో గ్రాము బంగారు కిరీటం సమర్పణ
వెల్దుర్తి సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్: స్థానిక గ్రామ దేవత శ్రీ ఎల్లమ్మ అమ్మవారికి శనివారం/ఆదివారం పురపాలక పరిధిలోని (వెల్దుర్తి) ప్రముఖ అర్చకులు, భక్తులు అయిన కిట్టయ్య శాస్త్రి కుటుంబ సభ్యులు గ్రాండ్ నివేదనగా ఒక కిలో గ్రాము (1 kg) బరువుగల సువర్ణ (బంగారు) కిరీటాన్ని బహుకరిస్తున్నారు.ఈ సందర్భంగా కిట్టయ్య శాస్త్రి కుటుంబ సభ్యులు ఈరోజే ఆలయానికి చేరుకున్నారు. ఉదయం 10:30 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారికి ఈ బంగారు కిరీటాన్ని ఘనంగా సమర్పించనున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, అలంకారాలు పూర్తి చేసి అమ్మవారికి కిరీట ధారణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పురప్రముఖులు, భక్తులు విశేషంగా పాల్గొంటున్నారు. సూర్య ప్రతినిధి షేక్ దస్తు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం