BREAKING
ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్: ఓల్డ్ టౌన్ లో ఓటర్ల ఉత్సాహం తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ స్పాట్ అడ్మిషన్లు 10 కోర్సుల్లో 378 ఖాళీ సీట్లు.. నవంబర్ 7న ప్రవేశాల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ షూటింగ్ అప్‌డేట్, శ్రీలంకలో భారీ యాక్షన్ షెడ్యూల్ జాహ్నవి రెడ్డికి మద్దతుగా ఇంటింటా ప్రచారం 108 అంబులెన్సులో సుఖప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం! బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 హౌస్ నుంచి రోహిత్ నాయుడు ఎలిమినేట్, షాకింగ్ నిర్ణయంతో కలకలం గోదావరి పుష్కర పనులు సకాలంలో పూర్తి చేయాలి - దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆదేశం యాంకరింగ్‌ రంగంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సుమ, తన ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు తిరుపతి జిల్లాలో కొనసాగుతున్న స్థానిక మున్సిపల్ ఎన్నికలు రామాయణంలో సీత పాత్రపై సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు, ఆ విశేషాలు ఇవే ఓ మై డాగ్ సినిమా రివ్యూ, పంకజ్ త్రిపాఠి నటించిన ఈ చిత్ర విశేషాలు ఇవే బంగారం ప్రియులకు భారీ ఊరట, దిగొచ్చిన పసిడి ధరలు, నవంబర్ 1 తాజా రేట్లు ఇవే ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి శ్రీలక్ష్మి

ఎంపీటీసీలు ఏకగ్రీవం సరే.. జడ్పిటిసి ఓట్లు ఎలా ?

Select Suryaa Now
ఎంపీటీసీలు ఏకగ్రీవం సరే.. జడ్పిటిసి ఓట్లు ఎలా ?

ఎంపీటీసీలు ఏకగ్రీవం సరే... జడ్పిటిసి ఎన్నికల్లో ఓట్లు  ఎలా?
- అనంత రూరల్ మండల ప్రజలు అధికార కూటమికి వన్ సైడ్ గా తీర్పు ఇస్తారా ?
-   ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తారా ?

  • ఉత్కంఠ రేపుతున్న రూరల్ జడ్పిటిసి ఎన్నికలు

 అనంతపురము రూరల్ మేజర్ న్యూస్ :  అనంతపురము రూరల్ మండలంలో 36 ఎంపీటీసీ స్థానాలకు.. 7 ఎంపీటీసీ స్థానాలు ఇప్పటికే  ఏకగ్రీవమయ్యాయి. మరో 29 ఎంపిటిసి స్థానాలకు ఈనెల 5న ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ..  12 ఎంపిటిసి స్థానాలను అధికార కూటమి గెలిస్తే. మ్యాజిక్ ఫిగర్ 19 కి చేరుకొని.. ఎంపీపీ పీఠాన్ని  కైవసం చేసుకుంటుంది.  అధికారంలో ఉండి.. మరో  12 ఎంపీటీసీ స్థానాలు... గెలుపు కూటమికి కష్టమేమీ కాదన్నా ధీమా.. అధికార పార్టీ నాయకులలో వ్యక్తం అవుతుంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. రూరల్
జడ్పిటిసి ఎన్నికల్లోనే కూటమికి వన్ సైడ్ గా.. విజయం వరిస్తుందా.. గట్టి పోటీ తప్పదన్న  ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  రూరల్ జెడ్పిటిసి స్థానానికి అధికార కూటమి నుండి టిడిపి మండల నాయకుడు, జిల్లా బలిజ సంఘం నాయకులు పాము రాయి వెంకటేష్ సతీమణి ముంగర మాధవి, ప్రతిపక్ష వైసిపి నుంచి  పార్టీ మండల కన్వీనర్, కొడిమి గ్రామానికి చెందిన బండి పవన్ కుమార్ సతీమణి బండి రోహిణి ప్రధాన అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.అధికారంలో  ఉండి.. జెడ్పిటిసి సీటును నిలబెట్టుకోలేకపోతే... కూటమి ప్రభుత్వం పైనా, అభ్యర్థిపైనా ప్రజలలో ఉన్న వ్యతిరేకత   స్పష్టం చేయనుంది. రూరల్ మండలంలోని అధికార కూటమి నాయకులలో  కూడా   జడ్పిటిసి స్థానంలోనే.. ఈజీగా  గెలుస్తామా?   లేక  పోటాపోటీగా  బయటపడతామా అనే ఆందోళన నెలకొంది.  జడ్పిటిసి ఎన్నికల్లో
ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు ఓడిపోయిన... 2029 ఎన్నికలకు బలపడేందుకు .. ఎలా పని చేయాలి.. ప్రజల్లోకి ఎలా వెళ్లాలి అనేది.. వైసీపీ నాయకులు, కార్యకర్తలకు తెలియజేస్తుంది. అయితే వైసిపి కూడా  కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్ వైఫల్యాలు,  ప్రజా వ్యతిరేక విధానాలు, వైసీపీ అధినేత వైయస్ జగన్ కు ప్రజలలో ఉన్న అభిమానంతో.. జడ్పిటిసి స్థానాన్ని గెలుచుకోవాలని  ప్రయత్నిస్తుంది. 
కానీ అధికార కూటమి కూడా గత ఎన్నికల్లో ప్రజలలో వైసీపీకి ఉన్న వ్యతిరేకత.. ఇప్పటికీ  ఉందని భావిస్తూనే... ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గత రెండున్నర ఏళ్లలో  ప్రవేశపెట్టిన.. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా.. తీసుకెళ్లి  జడ్పిటిసి స్థానంను ప్రతిష్టాత్మకంగా  తీసుకొని గెలుపు కోసం పనిచేస్తుంది.

36 ఎంపిటిసి స్థానాల్లోనూ జెడ్పిటిసి స్థానానికి పోలింగ్

అనంత  రూరల్, అర్బన్ మండలంలోని  36 ఎంపిటిసి స్థానాల్లోనూ 
జడ్పిటిసి స్థానానికి ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.  ఎంపీటీసీ స్థానాల గెలుపు.. గ్రామాలలో.. స్థానికంగా.. ఉండే అభ్యర్థుల బల, బలాలు ఆధారంగా  ప్రజలు నిర్ణయిస్తారు. కానీ జడ్పిటిసి స్థానం.. మండలానికి  జరిగే ఎన్నికలు కావడంతో..  ఎంపీటీసీ స్థానంకు.. ఓ పార్టీకి ఓటు వేసి, జడ్పిటిసి కు మరో పార్టీకి ఓటు వేస్తే.. ఏ పార్టీకి నష్టం.. ఏ పార్టీకి లాభం జరుగుతుందోన్న ప్రశ్న..తలెత్తుతుంది. ఇదే జరిగితే.. రూరల్ మండలంలో వైసీపీకి పట్టున్న గ్రామాలలో.. అధికార పార్టీ జడ్పిటిసి అభ్యర్థి.. గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.సహజంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా.. అదే పార్టీకి మెజార్టీ సీట్లు గెలుచుకుంటుంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే.. ప్రభుత్వ, ఎమ్మెల్యేల మద్దతుతో.. మండల, గ్రామాలకు సిసి రోడ్లు, డ్రైనేజీలు,  అభివృద్ధి పనులకు నిధులు తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.   ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గ్రామాలలో ప్రజలకు సంబంధించిన వివిధ పనులు, సమస్యలను అధికార పార్టీ జడ్పిటిసి ద్వారా.. అధికారులతో పనులు చేయించుకునే అవకాశం ఉంటుందని.. అటువైపు మొగ్గు చూపు చూపుతారు. కానీ
ప్రస్తుతం రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాల తర్వాత.. జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు.. కావడంతో.. ప్రభుత్వం సూపర్ సిక్స్ లో ఆడబిడ్డ నిధి పథకం ప్రతి నెల రూ. 1500  ఇస్తామన్న హామీ,   నెరవేర్చకపోవడం, రాష్ట్రంలో కొత్త పింఛన్లు ఇవ్వకపోవడం, నిరుద్యోగులకు రూ. 3 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడంతో.... వీటి ప్రభావంతో మహిళలు, నిరుద్యోగులు.. కూటమికి ఓట్లు వేస్తారా.. లేక ప్రతిపక్ష వైసీపీకి  మొగ్గు చూపుతారా అనేది అంతు చిక్కడం లేదు.