BREAKING
చైనా రియల్ రంగంలో పీఏజీ సంస్థ డీల్ బ్లూప్రింట్ రూపకల్పన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవితవ్యంపై పెరుగుతున్న చర్చ ఆటోమొబైల్ మార్కెట్‌లోనూ నిలకడగా ఫోర్వియా త్రైమాసిక ఆదాయాలు పెరిగిన ఇంధన ధరల భారం..వేతనాలు ఫ్రీజ్ చేయడంపై రాయ్‌ఎయిర్ ఆలోచన టేకోవర్ సమయంలో సీఈవో వేతన నిబంధనల్లో గ్లెన్‌కోర్ కీలక నిర్ణయం డిసెంబర్‌లో వడ్డీ రేట్ల పెంపుపై జపాన్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం జర్మనీలో వ్యూహాత్మక మార్పు దిశగా ఏఎఫ్‌డీ పార్టీ అడుగులు బంగ్లాదేశ్‌లో భారీగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వస్త్ర పరిశ్రమ కార్మికుల ఆందోళనలు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు చైనా-ఒమన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కంబదూర్ జెడ్పి స్థానంపై కూటమిలో లొల్లి... రగ్బీ రాష్ట్ర స్థాయిలో శ్రీ సుధ విద్యార్థికి గోల్డ్ మెడల్ ఇవాళ హైదరాబాద్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తెలంగాణ వేదికగా కాంగ్రెస్‌పై విరుచుకుపడేందుకు బీజేపీ వ్యూహం చంద్రుగొండలో ఉచితంగా ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమం మధ్యంతర ఎన్నికల ప్రచార హోరు..అయోవా, కాన్సాస్‌లలో ట్రంప్ పర్యటనలు

గ్రామీణాభివృద్ధిలో విశేష కృషి.. 5వ రోహిణి నయ్యర్ పురస్కారాన్ని దక్కించుకున్న టెక్ విద్యావేత్త ప్రశాంత్ చౌదరి!

Select Suryaa Now
గ్రామీణాభివృద్ధిలో విశేష కృషి.. 5వ రోహిణి నయ్యర్ పురస్కారాన్ని దక్కించుకున్న టెక్ విద్యావేత్త ప్రశాంత్ చౌదరి!

సూర్య నేషనల్ బ్యూరో, న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతి కోసం అంకితభావంతో పనిచేస్తున్న యువ ప్రతిభావంతులకు అందించే ప్రతిష్టాత్మక ‘రోహిణి నయ్యర్ పురస్కారం’ ఈ ఏడాది టెక్ విద్యావేత్త ప్రశాంత్ చౌదరిని వరించింది. గ్రామీణ విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్యను చేరువ చేయడం, స్థానిక యువతకు ఉపాధి నైపుణ్యాలను అందించడంలో ఆయన చూపిన విశేష కృషికి గుర్తింపుగా 5వ రోహిణి నయ్యర్ ప్రైజ్‌ను ఆయనకు ప్రదానం చేశారు. ఈ అవార్డు కింద ప్రశస్తి పత్రంతో పాటు ₹10 లక్షల నగదు బహుమతిని అందజేశారు.

మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అంతరాన్ని  తొలగించడమే లక్ష్యంగా ప్రశాంత్ చౌదరి వినూత్న విద్యా కార్యక్రమాలను రూపొందించారు. ఆధునిక కంప్యూటర్ పరిజ్ఞానం, కోడింగ్, డిజిటల్ టూల్స్‌ను స్థానిక భాషల్లో సులభంగా అర్థమయ్యే రీతిలో గ్రామీణ పాఠశాలల విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు చేరవేస్తూ వారిలో సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపారు. క్షేత్రస్థాయిలో ఆయన రూపొందించిన ఈ విద్యా మోడల్ స్థానికంగా స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించింది.

దివంగత ప్రముఖ ఆర్థికవేత్త, గ్రామీణాభివృద్ధి నిపుణురాలు డాక్టర్ రోహిణి నయ్యర్ జ్ఞాపకార్థం 'నయ్యర్ ఫౌండేషన్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్' ఆధ్వర్యంలో 40 ఏళ్ల లోపు యువతీయువకులకు ఏటా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేస్తున్నారు. సాంకేతికతను సామాజిక మార్పు కోసం శక్తివంతమైన సాధనంగా మలిచి గ్రామీణ సమాజంలో సానుకూల పరివర్తన తెచ్చిన ప్రశాంత్ చౌదరి కృషిని అవార్డు జ్యూరీ ప్రశంసించింది.