BREAKING
యూరోనెక్స్ట్ ఎక్స్ఛేంజ్‌లో సీఈవో పదవి నుంచి వైదొలగనున్న స్టెఫాన్ బౌజ్నా విద్యార్థిని ఆరోగ్యంపై లోకేష్‌కు ఊరటనిచ్చిన శుభవార్త బెల్జియంలో కూలిపోయిన బడ్జెట్ చర్చలు, ప్రధాని రాజీనామాకు సిద్ధం? ఐపీవో ఫైలింగ్‌తో జపాన్ ఇన్వెస్టర్ల నుంచి భారీ వాటాల విక్రయానికి ఆంత్రోపిక్ ప్రణాళిక అమెరికా నావికాదళంతో థేల్స్ ఒప్పందం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతలే ప్రధానం మెక్సికోలో తెగులు ఆందోళనతో టన్నుల కొద్దీ అవకాడో పంట దగ్ధం ఫార్ములా 1 చరిత్రలోనే సరికొత్త రికార్డు..ఎఫ్‌1 వరల్డ్ ఛాంపియన్‌గా కిమి ఆంటోనెల్లి తవాంగ్ మఠానికి చేరుకున్న గౌతమ బుద్ధుని పవిత్ర ధాతువులు నేపాల్‌ మంచు తుఫానులో చిక్కుకున్న భారతీయ పర్యాటకులు సురక్షితం న్యూజిలాండ్‌లో జోరుగా ముందస్తు ఎన్నికల పోలింగ్ అంతర్జాతీయ వేదికపై ‘వేవ్స్’ ఓటీటీ ప్రదర్శన ప్రసార భారతికి ఏబీయూ వేదికపై రెండు అంతర్జాతీయ పురస్కారాలు చైనా రియల్ రంగంలో పీఏజీ సంస్థ డీల్ బ్లూప్రింట్ రూపకల్పన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవితవ్యంపై పెరుగుతున్న చర్చ

కంబదూర్ జెడ్పి స్థానంపై కూటమిలో లొల్లి...

Select Suryaa Now
కంబదూర్ జెడ్పి స్థానంపై కూటమిలో లొల్లి...

మేజర్ న్యూస్, కంబదూరు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కంబదూరు మండల జడ్పీటీసీ స్థానం కూటమి పార్టీల మధ్య రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించగా, ఆ పార్టీ అభ్యర్థి హారిక బరిలో నిలిచారు. పార్టీ అధిష్టానం నుంచి బీఫామ్ అందుకుని గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తున్నప్పటికీ, స్థానిక టీడీపీ నాయకుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. జడ్పీటీసీ స్థానాన్ని జనసేనకు కేటాయించిన నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థి హారికకు కూటమి నాయకులందరూ కలిసికట్టుగా మద్దతు తెలపాల్సి ఉండగా, క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి హారికతో పాటు టీడీపీ మాజీ జడ్పీటీసీ రామ్మోహన్ చౌదరి భార్య చంద్రిక, టీడీపీ సీనియర్ నాయకుడు కొత్తిమీర వెంకటేశులు కోడలు మౌనిక, గుద్దిళ్ల గ్రామానికి చెందిన వేముల శారద కూడా నామినేషన్లు దాఖలు చేశారు. హారిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును కలిసి ఆశీస్సులు పొందిన అనంతరం తొలుత టీడీపీ సీనియర్ నాయకులు రామ్మోహన్ చౌదరి, లక్ష్మీనారాయణ చౌదరితో పాటు పలువురు నాయకులు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి హారికను గెలిపించాలని ప్రచారం నిర్వహించినట్లు సమాచారం. అయితే కొద్ది రోజులకే రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటుచేసుకోవడంతో జనసేన అభ్యర్థికి టీడీపీ శ్రేణుల సహకారంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న వేముల శారదకు టీడీపీకి చెందిన కొందరు ముఖ్య నాయకుల ఆశీస్సులు ఉన్నాయనే ప్రచారం స్థానికంగా ఊపందుకుంది. ఆమె టెంకాయ గుర్తుపై పోటీ చేస్తూ టీడీపీ కండువాలు ధరించిన వ్యక్తులతో కలిసి ప్రచారం నిర్వహించడం, విక్టరీ నినాదాలు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. పొత్తులో జనసేనకు కేటాయించిన స్థానంలో ఆ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సి ఉండగా, స్వతంత్ర అభ్యర్థికి పరోక్షంగా సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారంపై సంబంధిత టీడీపీ నాయకుల నుంచి అధికారికంగా ఎలాంటి స్పష్టత వెలువడలేదు. ఇదిలా ఉండగా, కూటమి పొత్తు ధర్మాన్ని పాటించి జనసేన అభ్యర్థి హారికకే మద్దతు ఇవ్వాలని మాజీ జడ్పీటీసీ రామ్మోహన్ చౌదరి, మాజీ ఎంపీపీ లక్ష్మీనారాయణ చౌదరితో పాటు మరికొందరు నాయకులు తమ అభిప్రాయాన్ని కళ్యాణదుర్గం టీడీపీ పెద్దలకు తెలియజేసినట్లు సమాచారం. పొత్తులో కేటాయించిన స్థానంలో మిత్రపక్ష అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ద్వారా కూటమి ఐక్యతను చాటాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కంబదూరు జడ్పీటీసీ ఎన్నిక కూటమి పార్టీల మధ్య అంతర్గత విభేదాలను బయటపెడుతున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు జనసేన అభ్యర్థి గ్లాస్ గుర్తుపై విజయం సాధించేందుకు ప్రయత్నిస్తుండగా, మరోవైపు స్వతంత్ర అభ్యర్థి ప్రచారంలో టీడీపీ శ్రేణుల భాగస్వామ్యం చర్చకు దారితీస్తోంది. ఈ పరిణామాలపై కూటమి అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది? స్థానిక టీడీపీ నాయకులు చివరకు ఎవరికి మద్దతు ప్రకటిస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. కంబదూరు జడ్పీటీసీ స్థానం కూటమి ఐక్యతకు పరీక్షగా నిలుస్తుండగా, ఎన్నికల ఫలితాలపై ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సి ఉంది.
 

కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.