మురసు తుపాను ప్రభావం.. ఎన్టీఆర్ జిల్లాలో విద్యాసంస్థలకు నేడు సెలవు
విజయవాడ, మేజర్ న్యూస్: మురసు తుపాను తీవ్రత, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నవంబర్ 2వ తేదీ సోమవారం ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ సెలవు ప్రకటించారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు తప్పనిసరిగా మూసివేయాలని, ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తుపాను ప్రభావం తగ్గే వరకు విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.