BREAKING
కంబదూర్ జెడ్పి స్థానంపై కూటమిలో లొల్లి... రగ్బీ రాష్ట్ర స్థాయిలో శ్రీ సుధ విద్యార్థికి గోల్డ్ మెడల్ ఇవాళ హైదరాబాద్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తెలంగాణ వేదికగా కాంగ్రెస్‌పై విరుచుకుపడేందుకు బీజేపీ వ్యూహం చంద్రుగొండలో ఉచితంగా ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమం మధ్యంతర ఎన్నికల ప్రచార హోరు..అయోవా, కాన్సాస్‌లలో ట్రంప్ పర్యటనలు చైనా-ఒమన్ మధ్య సత్సంబంధాలు...చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వ్యాఖ్యలు యువతే లక్ష్యంగా డ్రగ్స్ విక్రయం.. అమీన్పూర్ లో గుట్టు రట్టైన మత్తు వ్యాపారం సిక్కింలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ పర్యటన ఇస్రో విజయవంతంగా నింగిలోకి ఎన్వీఎస్-03 నావిగేషన్ ఉపగ్రహం మురసు తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు అలర్ట్‌లు జారీ అల్పాహారంతో విద్యార్థులలో పోషక విలువలు పెరుగుతాయి: గ్రామ సర్పంచ్ నాగరాజు యాదవ్ స్ట్రాంగ్ రూములు పరిశీలించిన అధికారులు మిశ్రమ సంకేతాల వేళ ఒక శాతం లాభంతో ప్రారంభమైన సూచీలు నేడే ఆంధ్రప్రదేశ్‌ తీరానికి తీవ్ర తుపాను ‘మురసు’ స్పెయిన్ పర్యటనకు కేంద్ర మంత్రి పబిత్రా మార్గెరెటా

యువతే లక్ష్యంగా డ్రగ్స్ విక్రయం.. అమీన్పూర్ లో గుట్టు రట్టైన మత్తు వ్యాపారం

Select Suryaa Now
యువతే లక్ష్యంగా డ్రగ్స్ విక్రయం.. అమీన్పూర్ లో గుట్టు రట్టైన మత్తు వ్యాపారం

ఆమీన్ పూర్ :సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత సింథటిక్ డ్రగ్  ఎం డి ఎం ఏ విక్రయిస్తున్న  ఇద్దరు వ్యక్తులను పోలీసులు చాక చక్యంగా  పట్టుకున్నారు. నిందితులు హృతిక్ డి పాటిల్, (26) కర్ణాటక, సిద్ధార్థ (25) పాష మైలారం గా గుర్తించారు. వారి వద్ద నుంచి పది 10. 50 గ్రాములు ఎండిఎంఏ విలువ సుమారు 1.26.000 మరియు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 
అసలు ఏం జరిగింది? 
విశ్వాసనీయ సమాచారం మేరకు అమీన్పూర్ ప్రాంతంలో ఇద్దరు  వ్యక్తులు రహస్యంగా మత్తు పదార్థాలను విక్రయిస్తున్నట్లు పోలీసులకు నమ్మదగ సమాచారం అందింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందం  తో తనిఖీలు చేపట్టారు. అనుమానస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా  వారి వద్ద 10.50 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ బయటపడింది. 
ఇన్స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి వివరాల ప్రకారం ఇద్దరిపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరపరిచి రిమాండ్ కు తరలించాం అని తెలిపారు.