-పి. సి.వి.స్వామి కి ప్రతిష్ఠాత్మక ఇండియన్ గ్లోరి అవార్డ్ -- పలువురి అభినందనల వెల్లువ
---పి. సి.వి.స్వామి కి ప్రతిష్ఠాత్మక ఇండియన్ గ్లోరి అవార్డ్
-- పలువురి అభినందనల వెల్లువ
ఖమ్మం సూర్య (మేజర్ న్యూస్):
ప్రకృతి ఆరోగ్య వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్న ప్రముఖ నాడీ థెరిఫిస్ట్, సిద్దార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం నిర్వాహకులు పి.సి.వి. స్వామి కి ప్రతిష్టాత్మక ఇండియన్ గ్లోరీ అవార్డ్స్
దక్కింది.వందే భారత్ చిత్ర దర్శక,నిర్మాత ముళ్ళ రమేష్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించిన ఇండియన్ గ్లోరి అవార్డ్ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న ప్రముఖులకు అవార్డులను ప్రధానం చేసి, ఘనంగా సత్కరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాలలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వారిని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన ఇండియన్ గ్లోరీ అవార్డ్స్ కార్యక్రమములో ముఖ్య అతిధులుగా ప్రముఖ సినీ నటుడు సుమన్ తల్వార్, ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహరావు పాల్గొని అవార్డ్ లు అందజేశారు.దీనిలో భాగంగా
సహజ సిద్ధమైన ఆరోగ్య విధానాలు, ప్రకృతి ఆరోగ్య వైద్య ప్రాముఖ్యత మరియు ప్రజలలో ఆరోగ్యంపై అవగాహన కల్పించడంలో
సిద్దార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం నిర్వాహకులు, ప్రముఖ ఆక్యుపంక్చర్, నేచర్ కేర్ ,నాడీ థెరిఫిస్ట్,పి.సి.వి. స్వామి చేస్తున్న కృషికి గుర్తింపుగా అవార్డ్ ను ప్రధానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.అవార్డు గ్రహీత పి.సి.వి. స్వామి మాట్లాడుతూ ఈ పురస్కారం నాపై మరింత బాధ్యతను పెంచిందనీ, ప్రకృతి వైద్యాన్ని ప్రతి ఒక్కరికీ చేరువ చేయడం, సహజ సిద్ధమైన జీవన విధానం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించడమే నా ముఖ్య ఉద్దేశం అని ఆయన తెలిపారు.పి సి వి స్వామి కి ప్రతిష్టాత్మక అవార్డ్ దక్కటం పట్ల అభిమానులు, ప్రకృతి వైద్య నిపుణులు మరియు పలువురు ప్రముఖులు పి.సి.వి. స్వామికి అభినందనలు తెలియజేశారు