తూముకుంట బ్యాంక్ కాలనీలో పొంగిపొర్లుతున్న మురుగునీరు.. రెండు రోజులైనా స్పందించని అధికారులు
శామీర్‌పేట, మేజర్ న్యూస్:
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్, శామీర్‌పేట డివిజన్ తూముకుంట బ్యాంక్ కాలనీలో డ్రైనేజీ సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలోని మూడో లేన్‌లో నల్ల పోచమ్మ దేవాలయం సమీపంలో గత రెండు రోజులుగా డ్రైనేజీ నీరు పొంగిపొర్లుతూ రోడ్డుపై ప్రవహిస్తోంది. మురుగునీరు రోడ్డుపై నిలిచిపోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. అటుగా రాకపోకలు సాగించే వాహనదారులు, పాదచారులు సైతం అవస్థలు పడుతున్నారు.
రెండు రోజులుగా సమస్య కొనసాగుతున్నప్పటికీ సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి మురుగునీటిని తొలగించడంతో పాటు డ్రైనేజీ సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.
రిపోర్టర్: తాటికొండ రవి గౌడ్, ఉమ్మడి శామీర్ పేట్, మేడ్చల్ జిల్లా.