హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ క్యూ2 సమీక్ష: సన్ ఫార్మా, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా 8 స్టాక్స్‌పై 'బై' రేటింగ్
సూర్య బిజినెస్ బ్యూరో, ముంబై: సెప్టెంబర్ త్రైమాసికం (Q2 FY27) ఫలితాల వెల్లడి అనంతరం ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ దేశీయ మార్కెట్లోని ఎనిమిది కీలక కంపెనీల ఆర్థిక పనితీరును సమీక్షించింది. ఫార్మా, పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్, ఎనర్జీ, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఇన్సూరెన్స్ అగ్రిగేటర్ తదితర రంగాలకు చెందిన ప్రధాన స్టాక్స్‌పై తమ విశ్లేషణను విడుదల చేస్తూ టార్గెట్ ధరలను సవరించింది. వీటిలో సన్ ఫార్మా, బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటు పీబీ ఫిన్‌టెక్, గెయిల్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, వి-గార్డ్ వంటి కంపెనీలు ఉన్నాయి.
బ్రోకరేజ్ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు:
సన్ ఫార్మా దేశీయ ఫార్ములేషన్ మార్కెట్లో స్థిరమైన వృద్ధి (YoY +17%), గ్లోబల్ స్పెషాలిటీ పోర్ట్‌ఫోలియో క్రమంగా పుంజుకుంటుందన్న అంచనాలతో హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఈ కౌంటర్‌పై 'బై' (Buy) రేటింగ్‌ను కొనసాగిస్తూ టార్గెట్ ధరను ₹2,180కి సవరించింది.
*బ్యాంక్ ఆఫ్ బరోడా: సెప్టెంబర్ త్రైమాసికంలో ఎన్‌ఎస్‌ఈ వాటా విక్రయం ద్వారా వచ్చిన వన్-ఆఫ్ ట్రెజరీ లాభాలు, స్థిరమైన రుణ వృద్ధి, మెరుగైన ఆస్తుల నాణ్యత (GNPA క్షీణత) వంటి అంశాలు బ్యాంకుకు సానుకూలంగా మారాయి. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుపై బ్రోకరేజ్ సానుకూల దృక్పథాన్ని కనబరుస్తూ కొనుగోలుకు మొగ్గు చూపింది.
వి-గార్డ్ ఇండస్ట్రీస్ : గత రెండు నెలల్లో షేరు విలువ సుమారు 20% వరకు దిద్దుబాటుకు గురికావడంతో వాల్యుయేషన్లు ఆకర్షణీయంగా మారాయని, రిస్క్-రివార్డ్ అనుకూలంగా ఉండటంతో ₹430 టార్గెట్ ధరతో 'బై' రేటింగ్‌ను ఖరారు చేసింది.
ఇతర స్టాక్స్: గ్యాస్ ట్రాన్స్‌మిషన్ వాల్యూమ్స్ మెరుగ్గా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్ , పాలసీబజార్ మాతృసంస్థ పీబీ ఫిన్‌టెక్ , ఆదిత్య బిర్లా క్యాపిటల్, కెమికల్ కంపెనీ నోసిల్ తదితర షేర్లకు సంబంధించి మధ్య నుంచి దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఆకర్షణీయ రాబడులు దక్కే అవకాశాలున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ స్పష్టం చేసింది.
కంపెనీల కోర్ ఎర్నింగ్స్, మూలధన సామర్థ్యం, నిర్వహణ లాభాల దృష్ట్యా ఈ ఎనిమిది షేర్లలో అధిక శాతం కౌంటర్లపై 'బై' మరియు 'యాడ్' రేటింగ్‌లను కొనసాగిస్తున్నట్లు బ్రోకరేజ్ సంస్థ ఇన్వెస్టర్లకు సూచించింది.