అల్పాహారంతో విద్యార్థులలో పోషక విలువలు పెరుగుతాయి: గ్రామ సర్పంచ్ నాగరాజు యాదవ్
చౌడాపూర్,మేజర్ న్యూస్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అల్పాహారం పెట్టడం ఎంతో ప్రయోజనకరమని,ప్రతి విద్యార్థుల్లో కూడా అల్పాహారంతో పోషక విలువలు పెరగడమే కాకుండా పాఠశాలలో 100% హాజరును పెంపొందించవచ్చు అని అన్నారు. పేద విద్యార్థుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అల్పాహారం,మధ్యాహ్నం భోజన పథకం ను ప్రతి విద్యార్థి సద్వినియోగించుకొని సద్వినియోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని గ్రామ సర్పంచ్ నాగరాజు యాదవ్ విద్యార్థిని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ నడ్డి మనిషా నవీన్,పాఠశాల కమిటీల చైర్మన్లు సంటి యాదమ్మ,బాలమణి,గ్రామ పంచాయతీ కార్యదర్శి శైలజ రెడ్డి,పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వార్డు మెంబర్లు చందు,విజయ్ కుమార్,కుమార్,నరసింహులు, మల్లయ్య తదితరులు పాల్గొనడం జరిగింది.
రిపోర్టర్: విజయ్ కుమార్, చౌడపూర్, వికారాబాద్ జిల్లా.