BREAKING
కంబదూర్ జెడ్పి స్థానంపై కూటమిలో లొల్లి... రగ్బీ రాష్ట్ర స్థాయిలో శ్రీ సుధ విద్యార్థికి గోల్డ్ మెడల్ ఇవాళ హైదరాబాద్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తెలంగాణ వేదికగా కాంగ్రెస్‌పై విరుచుకుపడేందుకు బీజేపీ వ్యూహం చంద్రుగొండలో ఉచితంగా ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమం మధ్యంతర ఎన్నికల ప్రచార హోరు..అయోవా, కాన్సాస్‌లలో ట్రంప్ పర్యటనలు చైనా-ఒమన్ మధ్య సత్సంబంధాలు...చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వ్యాఖ్యలు యువతే లక్ష్యంగా డ్రగ్స్ విక్రయం.. అమీన్పూర్ లో గుట్టు రట్టైన మత్తు వ్యాపారం సిక్కింలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ పర్యటన ఇస్రో విజయవంతంగా నింగిలోకి ఎన్వీఎస్-03 నావిగేషన్ ఉపగ్రహం మురసు తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు అలర్ట్‌లు జారీ అల్పాహారంతో విద్యార్థులలో పోషక విలువలు పెరుగుతాయి: గ్రామ సర్పంచ్ నాగరాజు యాదవ్ స్ట్రాంగ్ రూములు పరిశీలించిన అధికారులు మిశ్రమ సంకేతాల వేళ ఒక శాతం లాభంతో ప్రారంభమైన సూచీలు నేడే ఆంధ్రప్రదేశ్‌ తీరానికి తీవ్ర తుపాను ‘మురసు’ స్పెయిన్ పర్యటనకు కేంద్ర మంత్రి పబిత్రా మార్గెరెటా

మురసు తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు అలర్ట్‌లు జారీ

Select Suryaa Now
మురసు తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు అలర్ట్‌లు జారీ

బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలకు ఆరెంజ్, రెడ్, ఎల్లో అలర్ట్‌లను జారీ చేశారు.

ఈరోజు (సోమవారం) రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందాని తెలిపింది. ఇక రేపు (మంగళవారం) తుఫాన్ తీవ్రత మరింత పెరిగే సూచనలు ఉండటంతో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేయగా, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

అదేవిధంగా, ఈ నెల 4వ తేదీన (బుధవారం) రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ కాగా, 5వ తేదీన (గురువారం) తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తుఫాన్ మూలంగా ఈదురుగాలులతో కూడిన తీవ్ర వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.