BREAKING
యూరోనెక్స్ట్ ఎక్స్ఛేంజ్‌లో సీఈవో పదవి నుంచి వైదొలగనున్న స్టెఫాన్ బౌజ్నా విద్యార్థిని ఆరోగ్యంపై లోకేష్‌కు ఊరటనిచ్చిన శుభవార్త బెల్జియంలో కూలిపోయిన బడ్జెట్ చర్చలు, ప్రధాని రాజీనామాకు సిద్ధం? ఐపీవో ఫైలింగ్‌తో జపాన్ ఇన్వెస్టర్ల నుంచి భారీ వాటాల విక్రయానికి ఆంత్రోపిక్ ప్రణాళిక అమెరికా నావికాదళంతో థేల్స్ ఒప్పందం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతలే ప్రధానం మెక్సికోలో తెగులు ఆందోళనతో టన్నుల కొద్దీ అవకాడో పంట దగ్ధం ఫార్ములా 1 చరిత్రలోనే సరికొత్త రికార్డు..ఎఫ్‌1 వరల్డ్ ఛాంపియన్‌గా కిమి ఆంటోనెల్లి తవాంగ్ మఠానికి చేరుకున్న గౌతమ బుద్ధుని పవిత్ర ధాతువులు నేపాల్‌ మంచు తుఫానులో చిక్కుకున్న భారతీయ పర్యాటకులు సురక్షితం న్యూజిలాండ్‌లో జోరుగా ముందస్తు ఎన్నికల పోలింగ్ అంతర్జాతీయ వేదికపై ‘వేవ్స్’ ఓటీటీ ప్రదర్శన ప్రసార భారతికి ఏబీయూ వేదికపై రెండు అంతర్జాతీయ పురస్కారాలు చైనా రియల్ రంగంలో పీఏజీ సంస్థ డీల్ బ్లూప్రింట్ రూపకల్పన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవితవ్యంపై పెరుగుతున్న చర్చ

రగ్బీ రాష్ట్ర స్థాయిలో శ్రీ సుధ విద్యార్థికి గోల్డ్ మెడల్

Select Suryaa Now
రగ్బీ రాష్ట్ర స్థాయిలో శ్రీ సుధ విద్యార్థికి గోల్డ్ మెడల్

వెల్దుర్తి,  మేజర్ న్యూస్:అన్నమయ్య జిల్లాలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో వెల్దుర్తి శ్రీ సుధ హైస్కూల్ విద్యార్థి గోల్డ్ మెడల్ సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ సాధనగిరి వేణుగోపాల్ తెలిపారు. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న వరుణ్ తేజ్ అండర్-14 విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, రాష్ట్ర స్థాయిలో పతకం సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు వరుణ్ తేజ్ గర్వకారణంగా నిలిచాడని అభినందించారు. భవిష్యత్తులో విద్యార్థి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.అనంతరం విజేత వరుణ్ తేజ్‌తో పాటు క్రీడాకారుడి ఎంపికకు కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయులు నాగరాజు, మనోహర్, రవికుమార్, సురేష్‌లను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ సాధనగిరి సుదర్శన్, డైరెక్టర్లు రాజా సుధాకర్ గుప్తా, కరణం సూర్యనారాయణ, ప్రిన్సిపల్ మేరీ చార్లెస్, వైస్ ప్రిన్సిపల్ షమీనా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.