విద్యార్థిని ఆరోగ్యంపై లోకేష్‌కు ఊరటనిచ్చిన శుభవార్త
సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి : రాప్తాడులో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందన్న వార్త విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు ఎంతో ఆనందాన్ని కలిగించింది. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రి వైద్యులు ఈరోజు ఉదయం బాలిక ఆరోగ్య పరిస్థితిపై సంతోషకరమైన సమాచారం అందించారని ఆయన వెల్లడించారు. వైద్యుల సూచనలను అర్థం చేసుకుంటూ బాలిక స్పందిస్తోందని ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోందని తెలిపారు. ఈ పరిణామం తనకే కాకుండా బాలిక త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ ఎంతో ఊరటనిచ్చే విషయమని పేర్కొన్నారు. విద్యార్థిని త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని మళ్లీ చిరునవ్వులతో మన ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు.