జైల్లో ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులను పరామర్శించిన తలారి రంగయ్య..
కళ్యాణదుర్గం: సబ్‌జైల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డే ముత్యాలు, గొల్ల అనిల్, దేవరాజు తదితరులను ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య పరామర్శించారు. లీగల్ సెల్ ప్రతినిధులతో కలిసి సబ్‌జైలుకు వెళ్లిన ఆయన, జైలులో ఉన్న పార్టీ నాయకులతో మాట్లాడి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులకు న్యాయపరమైన సహాయం అందించేందుకు పార్టీ తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. కష్టకాలంలో పార్టీ నాయకులకు, వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తూ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తలారి రంగయ్య ఆరోపించారు. పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో వారికి అండగా నిలవడం తమ బాధ్యతని పేర్కొన్నారు. న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంత్‌రెడ్డి, నియోజకవర్గ, మండల అధ్యక్షులు రామాంజనేయులు యాదవ్, గొల్ల సూరి, పట్టణ అధ్యక్షుడు సుధీర్, మున్సిపాలిటీ అధ్యక్షుడు మురళి, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శి ప్రకాష్, సన్నప్ప, పాత లింగ సన్నప్ప తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.