BREAKING
చెన్నై ఓపెన్ డబ్ల్యూటీఏ 250: క్వాలిఫైయింగ్ రౌండ్‌లోనే వెనుదిరిగిన భారత్ టెన్నిస్ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక! నితిన్ నబిన్ కరీంనగర్ పర్యటన వాయిదా 40 ఏళ్లగా టిడిపి జెండా మోసిన వారు, నేడు వైసీపీలో చేరిక... హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో అదరగొట్టిన భారత్: సింగిల్స్ టైటిల్స్ కైవసం చేసుకున్న పి.వి. సింధు, లక్ష్యసేన్! అధికారులతో హోంమంత్రి అనిత టెలీకాన్ఫరెన్స్ ఈ నగరానికి ఏమైంది..?! ఓటుహక్కు వినియోగానికి నిరాసక్తత.. ఇండియా 'ఎ' బౌలింగ్ దాడిలో ముకేశ్ ఐదు వికెట్లు, సిరాజ్ నాలుగు వికెట్లు: తొలి ఇన్నింగ్స్‌లో 424 పరుగులకు న్యూజిలాండ్ 'ఎ' ఆలౌట్! ఇనుగుర్తిలో బంజర కుంట అక్రమ తవ్వకాలపై రైతుల ఆగ్రహం-.. అధికారుల నిర్లక్ష్యంపై నిరసన.. హైదరాబాద్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయ దర్శనం, భారీ పాదయాత్ర నమీబియా సరికొత్త చరిత్ర: ఐర్లాండ్‌పై చారిత్రాత్మక వన్డే సిరీస్ విజయం! బీజేపీ పాలకవర్గ అవినీతిపై బండి సంజయ్‌ సమాధానం చెప్పాలి! టి20 పవర్ ప్లేలో అర్ష్‌దీప్ సింగ్ సంచలనం: టిమ్ సౌతీ ఆల్ టైమ్ రికార్డు సమం! అంతర్జాతీయ టీ20ల్లో నూర్ అహ్మద్ సంచలన రికార్డు: జింబాబ్వేపై ఆఫ్ఘనిస్తాన్ క్లీన్ స్వీప్! సొసైటీలో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరపాలని ప్రజావాణిలో ఫిర్యాదు బిగ్‌బాస్ 10 హౌస్‌లో ఊహించని పరిణామాలు: ఏవీ ప్రదర్శించకుండానే రోహిత్ ఎలిమినేట్!

ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

Select Suryaa Now
ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం మండపేట మండలంలో నవంబర్ 5వ తేదీన జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా మండపేట మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియను సోమవారం ప్రారంభించారు.రిటర్నింగ్ అధికారి టి. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షణలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.

ఎన్నికల విధుల్లో బాధ్యతలు నిర్వహించే ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా తమ ఓటు హక్కును కోల్పోకూడదనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ అధికారి టి. రాజేశ్వరరావు తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె. సత్యనారాయణమూర్తి, డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి డి. శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. మండల పరిషత్ సిబ్బంది అవసరమైన ఏర్పాట్లు చేసి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహిస్తున్నారు.