కూటమి జెడ్పిటిసి అభ్యర్థి ముంగర మాధవి ఎన్నికల ప్రచార హోరు
కూటమి జెడ్పిటిసి అభ్యర్థి ముంగర మాధవి ప్రచార హోరు
అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ : అనంతపురము రూరల్ మండల కూటమి జడ్పిటిసి అభ్యర్థి ముంగర మాధవి ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. పోలింగ్ సమీపిస్తుండడంతో.. గ్రామాలలో కూటమి అభ్యర్థుల ప్రచారం హొరెత్తుతుంది. సోమవారం అనంతపురం రూరల్ గ్రామపంచాయతీలో కూటమి జెడ్పిటిసి అభ్యర్థి ముంగర మాధవి, ఎంపీటీసీ 2 అభ్యర్థి కంసల లావణ్య, టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి .. కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ నవంబర్ 5 న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని... ఓటర్లను కోరారు. రాష్ట్రంలో టిడిపి, జనసేన, బిజెపితో కూడిన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని.. గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే... ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలలో.. కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు. మమ్మల్ని గెలిపిస్తే.. ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యే సహకారంతో.. నిధులు తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపిస్తామని జడ్పిటిసి అభ్యర్థి ముంగర మాధవి, ఎంపీటీసీ అభ్యర్థి కంసల లావణ్య ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో మాకు ఓటు వేసి ఆశీర్వదించాలని అభ్యర్థులు కోరారు.