BREAKING
అక్రమ మద్యం స్వాధీనం, శ్రీకాళహస్తి డిఎస్పి పావని ఓటీటీ వేదికగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌ కొత్త వెర్షన్: ఉత్కంఠభరితంగా ‘ఆఫ్టర్ డార్క్’ ట్రైలర్! రైతు మేళా ఏర్పాట్లపై సీఎంఓ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ సమీక్ష ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి పెండింగ్‌లో ఉంచకుండా చర్యలు తీసుకోవాలి.. కలెక్టర్ కోయ శ్రీహర్ష వైసిపి అభ్యర్థులను గెలిపించండి బియ్యపు పవిత్ర రెడ్డి ప్రభాస్ ‘ఫౌజీ’ సెట్స్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్: వెకేషన్ ముగించి షూటింగ్‌కు రెడీ అవుతున్న డార్లింగ్! రైతులకు నోటీసులు.. రికార్డులు జిల్లా కేంద్రంలో! పిడుగుపాటుతో ఇల్లు ధ్వంసం-పరిశీలించిన సర్పంచ్ కుమారస్వామి కల్యాణలక్ష్మి.. సక్సెషన్ భూముల దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన.తహసీల్దార్‌ అశోక్‌ పాశమైలారం హరితహారం పార్కు భూమికి రక్షణ కరువు! పది ఎకరాల పార్కు భూమి ఆక్రమణకు గురైందా? ఆసియా తయారీ రంగానికి ఎదురుదెబ్బ చైనా తీరప్రాంత ఒత్తిడిని ధీటుగా ఎదుర్కొంటాం వీబీ-గ్రామ్ జీ చట్టం కింద నూతన ఫిర్యాదుల పరిష్కారానికి 15 రోజుల గడువు షేర్ మొహమ్మద్ పేట సెగ్మెంట్ 2 లో వాసుదేవరెడ్డి దే విజయం అంటున్న గ్రామస్తులు వైద్య రంగంలో కృత్రిమ మేధ విప్లవం..ఏఐ వైపు అడుగులు వేస్తున్న హెల్త్‌కేర్ సెక్టార్

కుందుర్పి తెలుగు పార్టీ జెడ్పిటిసి అభ్యర్థి ప్రచారం జోరు.

Select Suryaa Now
కుందుర్పి తెలుగు పార్టీ జెడ్పిటిసి అభ్యర్థి ప్రచారం జోరు.

 కుందుర్పి మండలం కలిగులిమి గ్రామంలో టీడీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగింది. ప్రచార కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. గ్రామంలోని వీధుల్లో ఎక్కడ చూసినా టీడీపీ శ్రేణుల సందడి కనిపించగా, మహిళల భాగస్వామ్యంతో ప్రచారానికి మరింత ఊపు వచ్చింది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆశీస్సులతో, కుందుర్పి మండల టీడీపీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో జడ్పీటీసీ అభ్యర్థి జి.ఎల్. ప్రభావతి, ఎంపీటీసీ అభ్యర్థి సుజాతమ్మ గ్రామంలో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను ప్రస్తావిస్తూ తమకు అవకాశం కల్పించాలని కోరారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని అభ్యర్థులు ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. అభ్యర్థులకు మద్దతుగా నినాదాలు చేస్తూ గ్రామంలో ప్రచారాన్ని హోరెత్తించారు. ప్రతి గడపకు చేరుకుని ఓటర్లను కలవడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ప్రచారాన్ని కొనసాగించారు. కలిగులిమి గ్రామంలో మహిళల భాగస్వామ్యంతో సాగిన ఈ ప్రచారం స్థానికంగా రాజకీయ చర్చకు దారితీసింది. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారాన్ని మరింత విస్తృతం చేసేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమవుతున్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.