కల్యాణలక్ష్మి.. సక్సెషన్ భూముల దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన.తహసీల్దార్ అశోక్
కొండాపూర్ ;కొండాపూర్: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ, అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ఇందులో భాగంగా కొండాపూర్ మండల తహసీల్దార్ అశోక్ స్వయంగా గ్రామాల్లో పర్యటిస్తూ దరఖాస్తుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి వివరాలు, ధ్రువపత్రాలను తనిఖీ చేశారు.
చెర్ల గోపులారం, కొండాపూర్ గ్రామాల్లో కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల నివాసాలను సందర్శించి, సమర్పించిన ధ్రువపత్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తేర్పోల్, తోగర్పల్లి గ్రామాలో సక్సెషన్ భూముల మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి దరఖాస్తులను, సంబంధిత వివరాలను తనిఖీ చేశారు.
అర్హత నిర్ధారణకు ప్రత్యక్ష పరిశీలన
ఈ సందర్భంగా తహసీల్దార్ అశోక్ మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి పథకం, పట్టా భూముల భౌతిక మార్పిడి దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తుదారులను స్వయంగా కలిసి పూర్తి వివరాలు సేకరించి, ధ్రువపత్రాలను పరిశీలించిన అనంతరం అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నిజమైన అర్హులకు చేరేలా పారదర్శకంగా ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, గ్రామపంచాయతీ అధికారులు పాల్గొన్నారు. తేర్పోల్ జీపీవో రమేష్, తోగర్పల్లి జీపీవో తదితరులు పరిశీలనలో పాల్గొన్నారు.