BREAKING
ప్రజలతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారం. గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యం. వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ అభ్యర్థి చాకలి లక్ష్మి. వృద్ధురాలి అనుమానాస్పద మృతి - తిమ్మాపూర్ మండలంలో సంచలనం నెట్‌ఫ్లిక్స్ హర్రర్ కామెడీ కే-డ్రామా ‘డెడెండ్ జాబ్’ క్లైమాక్స్: లీ జే వూక్ సిరీస్ ఎండింగ్ ట్విస్ట్స్ ఇవే! TUWJ వికారాబాద్ జిల్లా తృతీయ మహాసభకు ఎమ్మెల్యే బీఎంఆర్‌కు ఆహ్వానం ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్‌లో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ అద్భుతమైన శుభారంభం! రామాయణంపై రాకింగ్ స్టార్ యష్ సంచలన వ్యాఖ్యలు: రాముడు, రావణుడు ఇద్దరితోనూ ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు! ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ: మలేషియాపై విజయం సాధించి నాలుగో జయభై మోగించిన భారత్! నెల్లూరు సముద్రంలో అల్లకల్లోలం నాగర్ కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో పీఎం రాహత్ పథకం సేవలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ చెన్నై ఓపెన్ డబ్ల్యూటీఏ 250: క్వాలిఫైయింగ్ రౌండ్‌లోనే వెనుదిరిగిన భారత్ టెన్నిస్ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక! నితిన్ నబిన్ కరీంనగర్ పర్యటన వాయిదా 40 ఏళ్లగా టిడిపి జెండా మోసిన వారు, నేడు వైసీపీలో చేరిక... హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో అదరగొట్టిన భారత్: సింగిల్స్ టైటిల్స్ కైవసం చేసుకున్న పి.వి. సింధు, లక్ష్యసేన్! అధికారులతో హోంమంత్రి అనిత టెలీకాన్ఫరెన్స్ ఈ నగరానికి ఏమైంది..?! ఓటుహక్కు వినియోగానికి నిరాసక్తత..

రైతు మేళా ఏర్పాట్లపై సీఎంఓ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ సమీక్ష

Select Suryaa Now
రైతు మేళా ఏర్పాట్లపై సీఎంఓ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ సమీక్ష

దుద్యాల, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలో నవంబర్ 7, 8, 9 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న రైతు మేళా, ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్ సోమవారం మేళా ప్రాంగణాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏర్పాట్లను సమీక్షించారు. వికారాబాద్, నారాయణపేట జిల్లా కలెక్టర్లు దీపక్ తివారీ, ప్రియాంక, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాతో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు మేళా ప్రాంగణంలో సభా వేదిక, వివిధ శాఖల స్టాళ్లు, పార్కింగ్, వీవీఐపీ గ్యాలరీ, భోజన వసతి తదితర ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మూడు రోజుల పాటు జరిగే రైతు మేళాకు పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని శ్రీధర్ సూచించారు. ముఖ్యమంత్రి పాల్గొనే భారీ బహిరంగ సభకు వచ్చే ప్రజలకు రవాణా, పార్కింగ్, తాగునీరు, భోజనం తదితర సౌకర్యాలు సమకూర్చాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి రైతు మేళాను విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ బి. గోపి, ఉద్యానవన శాఖ డైరెక్టర్ యాస్మిన్ భాష, జిల్లా అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, అదనపు ఎస్పీ రాజేష్ మీనా, కడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

రిపోర్టర్:రమేష్, దుద్యాల్, వికారాబాద్ జిల్లా.