BREAKING
ప్రజలతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారం. గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యం. వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ అభ్యర్థి చాకలి లక్ష్మి. వృద్ధురాలి అనుమానాస్పద మృతి - తిమ్మాపూర్ మండలంలో సంచలనం నెట్‌ఫ్లిక్స్ హర్రర్ కామెడీ కే-డ్రామా ‘డెడెండ్ జాబ్’ క్లైమాక్స్: లీ జే వూక్ సిరీస్ ఎండింగ్ ట్విస్ట్స్ ఇవే! TUWJ వికారాబాద్ జిల్లా తృతీయ మహాసభకు ఎమ్మెల్యే బీఎంఆర్‌కు ఆహ్వానం ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్‌లో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ అద్భుతమైన శుభారంభం! రామాయణంపై రాకింగ్ స్టార్ యష్ సంచలన వ్యాఖ్యలు: రాముడు, రావణుడు ఇద్దరితోనూ ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు! ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ: మలేషియాపై విజయం సాధించి నాలుగో జయభై మోగించిన భారత్! నెల్లూరు సముద్రంలో అల్లకల్లోలం నాగర్ కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో పీఎం రాహత్ పథకం సేవలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ చెన్నై ఓపెన్ డబ్ల్యూటీఏ 250: క్వాలిఫైయింగ్ రౌండ్‌లోనే వెనుదిరిగిన భారత్ టెన్నిస్ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక! నితిన్ నబిన్ కరీంనగర్ పర్యటన వాయిదా 40 ఏళ్లగా టిడిపి జెండా మోసిన వారు, నేడు వైసీపీలో చేరిక... హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో అదరగొట్టిన భారత్: సింగిల్స్ టైటిల్స్ కైవసం చేసుకున్న పి.వి. సింధు, లక్ష్యసేన్! అధికారులతో హోంమంత్రి అనిత టెలీకాన్ఫరెన్స్ ఈ నగరానికి ఏమైంది..?! ఓటుహక్కు వినియోగానికి నిరాసక్తత..

ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి పెండింగ్‌లో ఉంచకుండా చర్యలు తీసుకోవాలి.. కలెక్టర్ కోయ శ్రీహర్ష

Select Suryaa Now
ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి  పెండింగ్‌లో ఉంచకుండా చర్యలు తీసుకోవాలి.. కలెక్టర్ కోయ శ్రీహర్ష

 

సూర్య పెద్దపల్లి ప్రతినిధి 

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములుతో కలిసి నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు.ధర్మారం మండలం కొత్తూరుకు చెందిన జోగుల లచ్చయ్య తన ఏడు గుంటల భూమికి పట్టాదారు హక్కులు కల్పించాలని, శ్రీరాంపూర్ మండలం తారుపల్లికి చెందిన జాసోదపు లక్ష్మి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. మంథని మండలం నాగారానికి చెందిన గాజుల ప్రశాంత్ ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కల్పించాలని, గోదావరిఖని 18 ఇంక్లైన్ కాలనీకి చెందిన గంట నరసమ్మ గృహజ్యోతి పథకం వర్తింపజేయాలని దరఖాస్తులు సమర్పించారు.ఈ అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తూ, క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.