BREAKING
ఇవాళ హైదరాబాద్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తెలంగాణ వేదికగా కాంగ్రెస్‌పై విరుచుకుపడేందుకు బీజేపీ వ్యూహం చంద్రుగొండలో ఉచితంగా ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమం మధ్యంతర ఎన్నికల ప్రచార హోరు..అయోవా, కాన్సాస్‌లలో ట్రంప్ పర్యటనలు చైనా-ఒమన్ మధ్య సత్సంబంధాలు...చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వ్యాఖ్యలు యువతే లక్ష్యంగా డ్రగ్స్ విక్రయం.. అమీన్పూర్ లో గుట్టు రట్టైన మత్తు వ్యాపారం సిక్కింలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ పర్యటన ఇస్రో విజయవంతంగా నింగిలోకి ఎన్వీఎస్-03 నావిగేషన్ ఉపగ్రహం మురసు తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు అలర్ట్‌లు జారీ అల్పాహారంతో విద్యార్థులలో పోషక విలువలు పెరుగుతాయి: గ్రామ సర్పంచ్ నాగరాజు యాదవ్ స్ట్రాంగ్ రూములు పరిశీలించిన అధికారులు మిశ్రమ సంకేతాల వేళ ఒక శాతం లాభంతో ప్రారంభమైన సూచీలు నేడే ఆంధ్రప్రదేశ్‌ తీరానికి తీవ్ర తుపాను ‘మురసు’ స్పెయిన్ పర్యటనకు కేంద్ర మంత్రి పబిత్రా మార్గెరెటా సింజెంటా ఐపీఓ వాల్యుయేషన్‌పై విశ్లేషకుల పెదవి విరుపు ఆసియాకు ముడి చమురు దిగుమతులు మళ్లీ యుద్ధానికి ముందు స్థాయికి

మురసు తుపాను నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి

Select Suryaa Now
మురసు తుపాను నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి

విజయవాడ, మేజర్ న్యూస్: మురసు తుపాను నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు ప్రాధాన్యతనిస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైన పునరావాస కేంద్రాలను తక్షణమే సిద్ధం చేయాలని, లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. తుపాను ప్రభావంతో రహదారులపై చెట్లు కూలితే వెంటనే తొలగించేలా, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే సత్వరమే పునరుద్ధరించేలా సంబంధిత శాఖలు సిద్ధంగా ఉండాలని సూచించారు. అత్యవసర వైద్య సేవలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. జిల్లా కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానంగా డివిజన్, మండల స్థాయిల్లో కమాండ్ కంట్రోల్ కేంద్రాలను క్రియాశీలం చేయాలని, క్షేత్రస్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రానికి చేరవేయాలని ఆదేశించారు. స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాలను 24 గంటల పాటు అందుబాటులో ఉంచి ప్రజల సమస్యలకు తక్షణమే స్పందించాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ తుపాను ప్రభావం తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.