ఇవాళ హైదరాబాద్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తెలంగాణ వేదికగా కాంగ్రెస్‌పై విరుచుకుపడేందుకు బీజేపీ వ్యూహం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీకి హైదరాబాద్ వేదికగానే బలమైన కౌంటర్ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమైంది. అమిత్ షా పర్యటనను తెలంగాణ బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. "ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం - అరాచకత్వాన్ని అంతం చేద్దాం" అనే ప్రధాన నినాదంతో ఈ సందర్భంగా భారీ పాదయాత్రను చేపట్టనున్నారు. ఈ పాదయాత్రలో అమిత్ షాతో పాటు రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొననున్నారు. ఈ పర్యటన ద్వారా కాంగ్రెస్ నిరసనలకు చెక్ పెట్టడంతో పాటు రాబోయే రాజకీయ పరిణామాలపై కీలక సందేశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా రాక నేపథ్యంలో నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.