చంద్రుగొండలో ఉచితంగా ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమం
సూర్య అన్నపురెడ్డిపల్లి చండ్రుగొండ,గ్రాడ్యుయేటగ్డ్ఓటర్లకు ఎం ఎస్ యు ఐ మండల అధ్యకులు ఎస్.కె.వసీం పాషా ఆధ్వర్యంలో ఉచిత నమోదు సౌకర్యం – నవంబర్ 6 వరకు అవకాశం ఉన్నట్లు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోని పట్టభద్రుల కోసం ఎన్ ఎస్ యు ఐ చంద్రుగొండ మండల అధ్యక్షులు ఎస్.కె వసీం పాషా ఆధ్వర్యంలో ఉచిత ఓటు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 2, 2026 నుంచి నవంబర్ 6, 2026 వరకు కొనసాగనుంది.
ఇప్పటివరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు కోసం నమోదు చేసుకోని అర్హులైన పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామి కావాలని తెలిపారు.
ఈ ఉచిత నమోదు కార్యక్రమం చంద్రుగొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించబడుతుంది. నమోదు చేసుకోవాలనుకునే వారు అవసరమైన పత్రాలతో కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
కావలసిన పత్రాలు:
1. పాస్‌పోర్ట్ సైజు ఫోటో
2. ఓటర్ ఐడీ కార్డు
3. ఆధార్ కార్డు
4. డిగ్రీ సర్టిఫికెట్
5. మొబైల్ నంబర్
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
???? 8639810884
???? 78936 48252
అర్హులైన పట్టభద్రులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఎస్.కె వసీం పాషా కోరారు.
సూర్య రిపోర్టర్ అన్నపురెడ్డిపల్లి/చండ్రుగొండ