telangana
పోలీసులు దృష్టి సారించాలి - సంగ నరేష్ బిజేవైయం జిల్లా అధ్యక్షులు
సూర్య చొప్పదండి : నవోదయ కెనాల్ పరిధిలో 5 హెచ్‌పీ మోటార్లు అపహరణ గురవుతుండడం రైతులకు ఇబ్బందికి గురిచేస్తుందని , గుర్తుతెలియని దొంగలు రైతుల పాలిట శాపంగా మారారని నరేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే చొప్పదండి పట్టణానికి చెందిన పలు రైతులకు సంబంధించిన 28 వ్యవసాయ బోరు మోటార్లను రాత్రి పూట దొంగలు అపహరించారని, ఒక్కొక్కటి 5 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన మోటార్లను ఫ్యూజులు తొలగించి మరీ ఎత్తుకెళ్లడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, వ్యవసాయ ప్రాంతాల్లో రాత్రి గస్తీని ముమ్మరం చేసి, మోటార్ల చోరీలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఈ సందర్భంగా పోలీసులను కోరారు.