BREAKING
ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి నిరుపేద నాయీ బ్రాహ్మణులకు ఇంటి స్థలాలు ఇప్పించండి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతి కార్పొరేటర్ నాగభూషణం దంపతులకు సన్మానం 19 న రూరల్ కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక అదే రోజు న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ల ఎన్నిక శ్రీనివాసపురంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. – వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ లావణ్య

పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న ప్రజా ప్రభుత్వం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Select Suryaa Now
పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న ప్రజా ప్రభుత్వం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్, మేజర్ న్యూస్: నిరుపేదల సొంతింటి కలను ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నెరవేరుస్తోందని తెలంగాణ శాసనసభ సభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన సొంతింటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకలని, పేదల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని బూరుగుపల్లిలో కావలి రాంచంద్రయ్య ముదిరాజ్, లక్ష్మి దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన గృహంలోకి ప్రవేశించిన రాంచంద్రయ్య కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఇంటిలో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.అంతకుముందు స్పీకర్‌కు రాంచంద్రయ్య కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.