BREAKING
మృతునీ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి 9వ వార్డులో డి. నజీర్ అహమ్మద్ విస్తృత ప్రచారం ఎస్సై శ్రీధర్ రెడ్డిని సన్మానించిన ముదిరాజ్ సంఘంనాయకులు వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌కు సూఫీ ఖాజా హుస్సేన్ మద్దతు స్వయంగా కలిసి మద్దతు కోరిన బీసీ రమేష్ గౌడ్ 61వ డివిజన్‌లో దొండ్లవాగు జయమ్మ ప్రచార హోరు.. ఇంటింటా ఓట్ల అభ్యర్థన.. భారీ జనసందోహం మధ్య టీడీపీ అభ్యర్థి ప్రచారం.. నక్కలపాలెంలో నేత్రదానం 40వ డివిజన్‌లో స్నేహ విస్తృత ప్రచారంటీడీపీ నాయకులతో కలిసి ఇంటింటి రెండో, రోడ్డు లో స్వతంత్ర మేయర్ అభ్యర్థి టోపీ వెంకటేష్ వాల్మీకి ప్రచార హోరు.. ఉంగరం గుర్తుకు ఓటేయాలని నగర ప్రజలకు విజ్ఞప్తి.. భారీ జనసందోహం మధ్య ప్రచారం.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ అమెరికా న్యాయస్థానం సంచలన తీర్పు ఫ్లోరిడాలో ట్రంప్ సంచలన ప్రకటన...ఇరాన్ వ్యవహారం తేలిన తర్వాత క్యూబాతో ఒప్పందంపై దృష్టి పటాన్‌చెరు 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి నిర్బంధంలో ఉన్న వలసదారులకు రాజ్యాంగపరమైన బెయిల్ విచారణ హక్కు లేదు ఈవీఎం గోదాములు పరిశీలించిన జిల్లా కలెక్టర్ అమెరికా మీడియా రంగంలో అనూహ్య పరిణామం

పటాన్‌చెరు 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి

Select Suryaa Now
పటాన్‌చెరు 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి

-ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్యులు,సిబ్బంది నియామకాలు చేపట్టాలి
-కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలి.. 
-మంత్రి వివేక్ వెంకటస్వామికి కొల్కూరి నరసింహారెడ్డి వినతి

 

పటాన్‌చెరు,

 

పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలో నిర్మించిన 200 పడకల సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రిని త్వరితగతిన ప్రారంభించి, లక్షలాది మంది కార్మికులు, స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షులు, పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కూరి నరసింహారెడ్డి రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం అందజేశారు. శనివారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసి ఆసుపత్రి ప్రారంభంలో జరుగుతున్న జాప్యం, వైద్యులు, సిబ్బంది నియామకాలు, వైద్య పరికరాల కొనుగోలుకు సంబంధించిన అంశాలను ఆయన వివరించారు.

నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోని ఆసుపత్రి

ఈ సందర్భంగా కొల్కూరి నరసింహారెడ్డి మాట్లాడుతూ, పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలో కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రిని మంజూరు చేశారని తెలిపారు. 2022 జూలై 16న మంజూరైన ఈ ఆసుపత్రికి 2023 జూన్‌లో శంకుస్థాపన జరిగిందని, నిధుల విడుదలలో జాప్యం కారణంగా నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయని పేర్కొన్నారు. 2024లో భవన నిర్మాణం పూర్తయినప్పటికీ, ఇప్పటివరకు ఆసుపత్రి ప్రారంభానికి నోచుకోకపోవడంతో కార్మికులు, ప్రజలు వైద్య సేవల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామిక ప్రాంతంలో ప్రమాదాలు, అత్యవసర వైద్య పరిస్థితులు ఎదురైనప్పుడు నాణ్యమైన వైద్యం అందించేందుకు ఈ ఆసుపత్రి ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు.

రూ.185.55 కోట్లతో నిర్మించిన ఆసుపత్రికి పూర్తిస్థాయి సదుపాయాలు కల్పించాలి

ఆసుపత్రి నిర్మాణానికి మొత్తం రూ.185.55 కోట్ల బడ్జెట్ కేటాయించగా, అందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.46.22 కోట్లు, బల్క్ డ్రగ్ పరిశ్రమల కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా రూ.138.65 కోట్లు సమకూర్చాల్సి ఉందని తెలిపారు. ఇంత భారీ వ్యయంతో నిర్మించిన ఆసుపత్రి ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందించాలంటే అవసరమైన అన్ని సదుపాయాలను వెంటనే కల్పించాలని మంత్రిని కోరారు.
 
వైద్యులు, సిబ్బంది పోస్టులు వెంటనే భర్తీ చేయాలి

ఆసుపత్రికి 58 మంది వైద్యులు అవసరం కాగా, ప్రస్తుతం 48 మంది పోస్టులకే మంజూరు లభించిందని, 180 మంది సిబ్బంది అవసరానికి కేవలం 58 మంది పోస్టులే మంజూరయ్యాయని నరసింహారెడ్డి తెలిపారు. మిగిలిన 10 మంది వైద్యులు, 122 మంది సిబ్బంది పోస్టులకు వెంటనే అనుమతులు మంజూరు చేసి నియామక ప్రక్రియ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ యంత్రాలతో పాటు బర్న్స్ వార్డుకు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలుకు నిధులు విడుదల చేయాలని కోరారు.పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న వేలాది పరిశ్రమల కార్మికులతో పాటు లక్షలాది మంది ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ఈ ఆసుపత్రి కీలకంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవ తీసుకొని ఆసుపత్రిని త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు చేపట్టడంతో పాటు, అవసరమైన వైద్యులు, సిబ్బంది నియామకాలు, వైద్య పరికరాల ఏర్పాటును పూర్తి చేయాలని కొల్కూరి నరసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు.