BREAKING
1,380 మంది బైండోవర్‌ కుప్పకూలిన బ్యాటింగ్ ఆర్డర్.. తొలి రోజు ఆటలో పూర్తి పట్టు సాధించిన న్యూజిలాండ్ ఆధునిక వసతులతో నూతన ఆసుపత్రి నిర్మాణం ఫౌజీ చిత్రంలో నేతాజీ సుభాస్ చంద్రబోస్ పాత్రలో అదరగొడుతున్న ఆ ప్రముఖ నటుడు ఎవరో తెలుసా సౌరవ్ గంగూలీ స్ఫూర్తితో ‘దూస్రా’ సినిమా.. ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ మృతునీ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి 9వ వార్డులో డి. నజీర్ అహమ్మద్ విస్తృత ప్రచారం ఎస్సై శ్రీధర్ రెడ్డిని సన్మానించిన ముదిరాజ్ సంఘంనాయకులు వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌కు సూఫీ ఖాజా హుస్సేన్ మద్దతు స్వయంగా కలిసి మద్దతు కోరిన బీసీ రమేష్ గౌడ్ 61వ డివిజన్‌లో దొండ్లవాగు జయమ్మ ప్రచార హోరు.. ఇంటింటా ఓట్ల అభ్యర్థన.. భారీ జనసందోహం మధ్య టీడీపీ అభ్యర్థి ప్రచారం.. నక్కలపాలెంలో నేత్రదానం 40వ డివిజన్‌లో స్నేహ విస్తృత ప్రచారంటీడీపీ నాయకులతో కలిసి ఇంటింటి రెండో, రోడ్డు లో స్వతంత్ర మేయర్ అభ్యర్థి టోపీ వెంకటేష్ వాల్మీకి ప్రచార హోరు.. ఉంగరం గుర్తుకు ఓటేయాలని నగర ప్రజలకు విజ్ఞప్తి.. భారీ జనసందోహం మధ్య ప్రచారం.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ అమెరికా న్యాయస్థానం సంచలన తీర్పు

రెండో, రోడ్డు లో స్వతంత్ర మేయర్ అభ్యర్థి టోపీ వెంకటేష్ వాల్మీకి ప్రచార హోరు.. ఉంగరం గుర్తుకు ఓటేయాలని నగర ప్రజలకు విజ్ఞప్తి.. భారీ జనసందోహం మధ్య ప్రచారం..

Select Suryaa Now
రెండో,  రోడ్డు లో స్వతంత్ర మేయర్ అభ్యర్థి టోపీ వెంకటేష్ వాల్మీకి ప్రచార హోరు..  ఉంగరం గుర్తుకు ఓటేయాలని నగర ప్రజలకు విజ్ఞప్తి.. భారీ జనసందోహం మధ్య ప్రచారం..

(అనంతపురము, కార్పొరేషన్ మేజర్ న్యూస్:)

అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో స్వతంత్ర మేయర్ అభ్యర్థి టోపీ వెంకటేష్ వాల్మీకి తన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. నగరంలోని రెండో రోడ్డు, మూడో రోడ్డు ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను నేరుగా కలుసుకుని తనకు మద్దతు తెలపాలని అభ్యర్థించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ప్రాంతంలో ప్రజలను పలకరిస్తూ, వారి ఆదరాభిమానాలు కోరుతూ ముందుకు సాగుతున్నారు. తన ఎన్నికల గుర్తు ఉంగరంను ప్రజలకు పరిచయం చేస్తూ, ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
టోపీ వెంకటేష్ వాల్మీకి ప్రచారానికి ఆయన అభిమానులు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో రెండో, మూడో రోడ్లలో సందడి నెలకొంది. భారీ జనసందోహం మధ్య సాగిన ప్రచారంతో ఆయా ప్రాంతాల్లో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. ప్రజలను నేరుగా కలుసుకుంటూ తనకు ఒక అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నారు.
స్వతంత్ర అభ్యర్థిగా మేయర్ పదవికి పోటీ చేస్తున్న టోపీ వెంకటేష్ వాల్మీకి నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ప్రచారాలు ఊపందుకోవడంతో అనంతపురం నగరంలో రాజకీయ సందడి నెలకొంది.