BREAKING
ఎన్నికల ఈవీఎంల గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌ కళ్యాణదుర్గంలో వైసీపీకి జలక్‌.. జనసేనలోకి ముఖ్య నాయకులు.. జిల్లా అధ్యక్షుడు టి.సి. వరుణ్ సమక్షంలో జనసేనలో చేరికలు పట్టభద్రులకు సువర్ణావకాశం - ఉచిత ఓటర్ నమోదు - సత్యవరపు సంపూర్ణ *రామన్నగూడెం గ్రామంలో అవగాహన సదస్సు - ఎస్హెచ్ఓ సాయి కిశోర్ రెడ్డి* బూర్గులకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు ఒకే వ్యక్తి రెండు పార్టీల తరపున నామినేషన్ పై అభ్యంతరం కృత్రిమ మేధస్సు దుర్వినియోగం ఆదోళనకరం -జాతీయ సదస్సులో వీసీ టాటా నర్సింగరావు| యువనేత బొమ్మిరెడ్డి తారక్ రెడ్డి ముమ్మర ప్రచారం రెండో టీ20లో ఘోరారంభం: 4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్.. భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ కృష్ణ స్విమర్స్ నూతన అధ్యక్షుడిగా పిన్నెల్లి పాండురంగారావు సమాజ హితానికి ముందుండండి గీతం రోటరాక్ట్ క్లబ్ సభ్యులకు ప్రముఖుల ఉద్బోధ ఇంటింటా ప్రచారంలో వెంకట సాయి జోరు.. గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థన.. మీ ఇంటి బిడ్డగా అందుబాటులో ఉంటా ఆశీర్వదించాలని విజ్ఞప్తి.. పంచాయతీ కార్యదర్శి రవిపై కలెక్టర్‌ సస్పెన్షన్‌ వేటు పోలీసులకు వ్యాసరచన పోటీలు 1,380 మంది బైండోవర్‌

1,380 మంది బైండోవర్‌

Select Suryaa Now
1,380 మంది బైండోవర్‌

బాపట్ల, మేజర్ న్యూస్:

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 1,380 మందిని ముందస్తుగా బైండోవర్‌ చేసినట్లు ఎస్పీ బి. ఉమా మహేశ్వర్‌ తెలిపారు. శనివారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బాపట్ల సబ్‌ డివిజన్‌లో 419 మంది, చీరాలలో 509 మంది, రేపల్లెలో 452 మందిపై ముందస్తు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని 300 ఎంపీటీసీ స్థానాలకు 1,549 మంది, 20 జెడ్పీటీసీ స్థానాలకు 138 మంది నామినేషన్లు దాఖలు చేశారన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున 17 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. రూ.50 వేలకుపైగా నగదు తీసుకెళ్లేవారు ఆధారాలు వెంట ఉంచుకోవాలని, ర్యాలీలు, సభలు, మైకుల వినియోగానికి ముందస్తు అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.