*రామన్నగూడెం గ్రామంలో అవగాహన సదస్సు - ఎస్హెచ్ఓ సాయి కిశోర్ రెడ్డి*
సూర్య, అశ్వారావుపేట:అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామంలో బుధవారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఎస్హెచ్ఓ సాయి కిశోర్ రెడ్డి గ్రామస్తులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా సైబర్ నేరాలు, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, రోడ్డు భద్రత నియమాలు, బాల్య వివాహాలు, మహిళల భద్రత, చిన్నారులపై వేధింపులు, 100, 112, 1930 హెల్ప్ లైన్ నంబర్ల వినియోగం గురించి వివరించారు.
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, విద్య, ఉపాధి వైపు దృష్టి పెట్టాలని, గ్రామంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.
సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట