గండిగూడెం అభివృద్ధిపై ప్రజల ప్రశ్నలు
టి. నరసాపురం, మేజర్ న్యూస్:స్థానిక సంస్థల ఎన్నికల్లో గండిగూడెం అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని గ్రామ పెద్ద కొరివి శేషారావు పిలుపునిచ్చారు. గత 30 ఏళ్లుగా గండిగూడెంతో పాటు కొరివి రామన్నపాలెం, పాకనాటిగూడెం, మానికలగూడెం గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్లు, డ్రైనేజీ, పక్కా ఇళ్లు, అసంపూర్తి అంగన్వాడీ భవనం, ఉడతల మెట్ట వ్యవసాయ రహదారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం వచ్చే నాయకులు, అభ్యర్థులు ఈ సమస్యలకు సమాధానం చెప్పిన తర్వాతే ఓట్లు అడగాలని కోరారు. ఈ సందర్భంగా మేము సైతం మిత్ర బృందం సహకారంతో ఫ్లెక్సీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు ఎస్.డి. నాసర్ పాషా, కొరివి నాగేశ్వరరావు, తలకొండ నాగబాబు, పొదిలి రామారావు తదితరులు పాల్గొన్నారు.