BREAKING
ఊర పందుల దాడిలో వృద్ధురాలు మృతి కొనరావుపేటలో భూముల రీసర్వే కు రైతులుఅదనపు కలెక్టర్ గడ్డం నగేష్ బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ విధ్వంసం.. ఏకంగా సలార్, సుల్తాన్ రికార్డులను అధిగమించిన జైలర్ 2 వివాదంపై స్పందించిన నటుడు మనోజ్ బాజ్‌పాయ్.. కుటుంబంపై ట్రోలింగ్ జరిగితే ఎంతగా కుంగిపోయానో చెప్పిన వైనం రూ.18.70 కోట్ల నిధులపై సమగ్ర విచారణ జరపాలి - సిపిఎం ఫౌజీ టీజర్ గూస్‌బంప్స్.. భగవద్గీత కోడ్‌తో బ్రిటీషర్లపై విరుచుకుపడనున్న సూపర్ స్పై ప్రభాస్ అర్హులైన ప్రతి కూలీకి పని కల్పించాలి : ఎంపీడీవో కృష్ణవేణి టిడిపి 40 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నాగే జానకమ్మ విస్తృత ప్రచారం ఫాక్స్ సంస్థ ఏఐ షోపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం.. చెత్త కంటెంట్‌గా విమర్శలు కేజీబీవీలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..ఆవరణలో వసతుల పరిశీలన సౌరవ్ గంగూలీ లార్డ్స్ సెలబ్రేషన్స్ స్ఫూర్తితో.. అభిలయ్ డియో మోస్ట్ అవేటెడ్ మూవీ దూస్ర ది లామెంట్ ఆఫ్ ఆటం.. రెడ్ ఫ్లాగ్ హీరో, తిరుగుబాటు హీరోయిన్‌తో పాలిటిక్స్ డ్రామా సూర్య కథనంతో వెలుగులు నింపుకున్న అంగడి చౌరస్తా..! జైలర్ 2 బాక్సాఫీస్ విధ్వంసం.. 9వ రోజు కలెక్షన్లతో బోర్డర్ 2 రికార్డులు బ్రేక్ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా నివాసంలో కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్, నీలం మధు

కేటీఆర్‌ తప్పుడు ప్రచారం చేస్తే ఆధారాలతో బయటపెడతా : ప్రభుత్వ విప్‌ బల్మూర్‌ వెంకట్‌

Select Suryaa Now
కేటీఆర్‌ తప్పుడు ప్రచారం చేస్తే ఆధారాలతో బయటపెడతా : ప్రభుత్వ విప్‌ బల్మూర్‌ వెంకట్‌

తెలంగాణ బ్యూరో ప్రతినిధి : రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత జీవితాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ డాక్టర్‌ బల్మూర్‌ వెంకట్‌ ఆరోపించారు. సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఆధారాలతో సహా బయటపెడతానని హెచ్చరించారు.శనివారం సీఎల్పీ కార్యాలయం లో ఆయన మీడియాతో మాట్లాడారు.

దుబాయ్‌ కేంద్రంగా కొందరు వ్యక్తులతో కలిసి సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, ఇందుకోసం భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని వెంకట్‌ ఆరోపించారు. యూట్యూబ్‌ ఛానళ్లకు నిధులు పంపిణీ చేస్తూ వ్యక్తిగత జీవితాలపై అసత్య ప్రచారం సాగిస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంలో కొండూరి సాకేత్‌తో పాటు మరికొందరి పాత్ర ఉందని పేర్కొంటూ, తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. స్కూల్‌, కాలేజీ రోజుల్లో స్నేహితులతో దిగిన ఫొటోలను సైతం వక్రీకరించి ప్రచారం చేయడం సరికాదన్నారు. రాజకీయ విమర్శలకు వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కుటుంబాలకు చెందిన పిల్లల ఫొటోలను దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

తన ఆరోపణలు తప్పని భావిస్తే కేటీఆర్‌ మీడియా ముందుకు వచ్చి వాస్తవాలను వెల్లడించాలని వెంకట్‌ సవాల్‌ విసిరారు. ఆరోపణలను ఖండించడంతో పాటు అవసరమైతే చట్టపరంగా ఎదుర్కోవాలని సూచించారు. సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాన్ని ప్రశ్నిస్తూ, సంబంధిత వ్యవహారాలను ప్రజల ముందుంచుతానని స్పష్టం చేశారు.