BREAKING
ఫాక్స్ సంస్థ ఏఐ షోపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం.. చెత్త కంటెంట్‌గా విమర్శలు కేజీబీవీలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..ఆవరణలో వసతుల పరిశీ సౌరవ్ గంగూలీ లార్డ్స్ సెలబ్రేషన్స్ స్ఫూర్తితో.. అభిలయ్ డియో మోస్ట్ అవేటెడ్ మూవీ దూస్ర ది లామెంట్ ఆఫ్ ఆటం.. రెడ్ ఫ్లాగ్ హీరో, తిరుగుబాటు హీరోయిన్‌తో పాలిటిక్స్ డ్రామా సూర్య కథనంతో వెలుగులు నింపుకున్న అంగడి చౌరస్తా..! జైలర్ 2 బాక్సాఫీస్ విధ్వంసం.. 9వ రోజు కలెక్షన్లతో బోర్డర్ 2 రికార్డులు బ్రేక్ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా నివాసంలో కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్, నీలం మధు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీల పంపిణీ. రోడ్లపై ధాన్యం ఆరబెట్టవద్దు.. రైతులకు రాజంపేట ఎస్ఐ సూచన.. ఉపాధి కూలీలకు జలసిరిపై అవగాహన రైల్వే బోర్డు సభ్యునిగా పోతర్ల సుదర్శన్ యాదవ్ నామాపూర్‌లో జిల్లాలోనే తొలి ఐకేపీ కేంద్రం ప్రారంభం రైతులకు గిట్టుబాటు ధర అందించడమే లక్ష్యం... గజ్జెల రాజు నామాపూర్‌లో జిల్లాలోనే తొలి ఐకేపీ కేంద్రం ప్రారంభం బిగ్‌బాస్ హౌస్‌లో రసవత్తరంగా మారిన ఆట.. ప్రత్యర్థులుగా పోటీపడి చివరకు సేవ్ అయిన త్రిగుణ్ డబ్బా జీపీలో విధుల నిర్వహణలో నిర్లక్ష్యం?

ఎల్‌నినోపై ముందస్తు హెచ్చరికలు భయపెట్టడం కాదు.. ప్రజలను అప్రమత్తం చేయడమే సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

Select Suryaa Now
ఎల్‌నినోపై ముందస్తు హెచ్చరికలు భయపెట్టడం కాదు.. ప్రజలను అప్రమత్తం చేయడమే   సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

 

తెలంగాణ బ్యూరో  ప్రతినిధి: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉందని ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడం బాధ్యతాయుతమైన పాలనలో భాగమని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం సిఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరువు వచ్చే వరకు వేచి చూడకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించడమే ప్రజాపాలన లక్ష్యమని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రపంచవ్యాప్త వాతావరణ పరిణామమని, దీనికి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. వాతావరణ పరిస్థితులపై ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం ప్రజలను భయపెట్టడం కాదని, వారిని కష్టాల నుంచి కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగమని వివరించారు. తాగునీరు, సాగునీరు, పశువులకు నీరు, పశుగ్రాసం, వ్యవసాయం, ఉపాధి రంగాలపై ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కోవిడ్‌ సమయంలో ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్‌, మందుల కొరతతో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందస్తు సన్నద్ధత చేపడితే తప్పేంటని ప్రశ్నించారు. అప్పటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాల పరిస్థితిని, ప్రస్తుతం చేపడుతున్న సన్నద్ధతను పోల్చి చూడాలని సూచించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కటే తెలంగాణ సాగునీటికి ఆధారం కాదని, శ్రీరాంసాగర్‌, వరద కాలువ, ఎల్లంపల్లి, చెరువులు, భూగర్భ జలాలు, బోర్ల ద్వారా కూడా రైతులు సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సమస్యలపై నిపుణుల నివేదికల ఆధారంగా సాంకేతిక పరిష్కారాల దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో ఉందన్న ప్రచారం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా లేదని మంత్రి వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రతిపక్ష నేతలు రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా రైతులు, ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మక సూచనలు చేయాలని కోరారు.

కరువు వస్తే చూస్తూ ఉండటం కాకుండా, వచ్చే అవకాశం ఉన్నప్పుడే సిద్ధం కావడం ప్రభుత్వ బాధ్యతని, ప్రజలకు వాస్తవ పరిస్థితులను తెలియజేస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపడతామని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.