BREAKING
ఫాక్స్ సంస్థ ఏఐ షోపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం.. చెత్త కంటెంట్‌గా విమర్శలు కేజీబీవీలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..ఆవరణలో వసతుల పరిశీ సౌరవ్ గంగూలీ లార్డ్స్ సెలబ్రేషన్స్ స్ఫూర్తితో.. అభిలయ్ డియో మోస్ట్ అవేటెడ్ మూవీ దూస్ర ది లామెంట్ ఆఫ్ ఆటం.. రెడ్ ఫ్లాగ్ హీరో, తిరుగుబాటు హీరోయిన్‌తో పాలిటిక్స్ డ్రామా సూర్య కథనంతో వెలుగులు నింపుకున్న అంగడి చౌరస్తా..! జైలర్ 2 బాక్సాఫీస్ విధ్వంసం.. 9వ రోజు కలెక్షన్లతో బోర్డర్ 2 రికార్డులు బ్రేక్ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా నివాసంలో కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్, నీలం మధు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీల పంపిణీ. రోడ్లపై ధాన్యం ఆరబెట్టవద్దు.. రైతులకు రాజంపేట ఎస్ఐ సూచన.. ఉపాధి కూలీలకు జలసిరిపై అవగాహన రైల్వే బోర్డు సభ్యునిగా పోతర్ల సుదర్శన్ యాదవ్ నామాపూర్‌లో జిల్లాలోనే తొలి ఐకేపీ కేంద్రం ప్రారంభం రైతులకు గిట్టుబాటు ధర అందించడమే లక్ష్యం... గజ్జెల రాజు నామాపూర్‌లో జిల్లాలోనే తొలి ఐకేపీ కేంద్రం ప్రారంభం బిగ్‌బాస్ హౌస్‌లో రసవత్తరంగా మారిన ఆట.. ప్రత్యర్థులుగా పోటీపడి చివరకు సేవ్ అయిన త్రిగుణ్ డబ్బా జీపీలో విధుల నిర్వహణలో నిర్లక్ష్యం?

కౌంటింగ్ కేంద్రంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి

Select Suryaa Now
కౌంటింగ్ కేంద్రంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి  జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి

గరివిడి, అక్టోబర్ 24, మేజర్ న్యూస్:

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో గరివిడి మండలంలోని ఎస్‌డీఎస్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న రిసెప్షన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ గదులను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి శనివారం పరిశీలించారు.

ఈ కేంద్రంలో మెరకముడిదాం, గుర్ల, చీపురుపల్లి, గరివిడి మండలాలకు సంబంధించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ మెటీరియల్ రిసెప్షన్, స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ నిర్వహణకు అవసరమైన గదులను కేటాయించి, రిసెప్షన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ గదుల్లో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను స్పష్టంగా ఏర్పాటు చేయాలని, వాహనాల పార్కింగ్‌కు తగిన స్థలం కేటాయించాలని, విధుల్లో పాల్గొనే సిబ్బందికి భోజన, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.

స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, నిరంతర పర్యవేక్షణకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటి పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపారు. అనుమతి ఉన్న వ్యక్తులకే నిర్దేశిత ప్రాంతాల్లోకి ప్రవేశం కల్పించాలని, ఎన్నికల సామగ్రి భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అపోహలకు, పొరపాట్లకు తావులేకుండా, ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ పూర్తి పారదర్శకతతో ఓట్ల లెక్కింపు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో చీపురుపల్లి ఆర్డీవో సుధారాణి, చీపురుపల్లి, గరివిడి తహసీల్దార్లు సంతోష్ కుమార్, బంగారు రాజు తదితరులు పాల్గొన్నారు.

శ్రీనివాస్ బ్యూరో, విజయనగరం