ఈ నెల 26న మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు.కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి : మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ఈ నెల 26న ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఆదివారం ఉదయం 10:30 గంటలకు సంగారెడ్డిలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.