అన్నోజిగూడ బొడ్రాయి ప్రతిష్టాపనకు సబితా ఇంద్రారెడ్డికి ఆహ్వానం
అన్నోజిగూడ బొడ్రాయి ప్రతిష్ఠాపనకు సబితా ఇంద్రారెడ్డికి ఆహ్వానం
కందుకూరు : కందుకూరు మండలం అన్నోజిగూడ గ్రామంలో ఈ నెల 29న ప్రారంభమై నవంబర్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న బొడ్రాయి ప్రతిష్ఠాపన (నాభిశిల) కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ మాజీ సర్పంచ్ కాకి ఇంద్రమ్మ ఆధ్వర్యంలో గ్రామ టీఆర్‌ఎస్ నాయకులు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సబితా ఇంద్రారెడ్డిని ఆమె నివాసంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.
నవంబర్ 1న నిర్వహించనున్న బోనాల ఊరేగింపు కార్యక్రమానికి సబితా ఇంద్రారెడ్డి హాజరుకానున్నట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు కాకి దశరథ ముదిరాజ్, మండల యువజన నాయకుడు రామకృష్ణ, గ్రామ అధ్యక్షుడు ప్రభుదాస్, మాజీ వార్డు సభ్యులు ఎడ్ల అరుణమ్మ, పుచ్చల సంతోష, గోదాస్ గణేష్, సీనియర్ నాయకులు ఎడ్ల కృష్ణ, ఎడ్ల కృష్ణయ్య, కాకి వేణు, పార్టీ ఉపాధ్యక్షుడు మారెమోని వెంకటేష్, వార్డు సభ్యుడు కాకి నందీశ్వర్, మహిపాల్ గౌడ్, మాజీ విద్యా కమిటీ చైర్మన్ జక్కుల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్