BREAKING
ఎల్‌నినోపై ముందస్తు హెచ్చరికలు భయపెట్టడం కాదు.. ప్రజలను అప్రమత్తం చేయడమే సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నోజిగూడ బొడ్రాయి ప్రతిష్టాపనకు సబితా ఇంద్రారెడ్డికి ఆహ్వానం కౌంటింగ్ కేంద్రంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి విజయ డంక మోగిస్తాం...! సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ తో ఎమ్మెల్యే చర్చ అక్రమ నీటి దందాపై హైడ్రా ఉక్కుపాదం గండిగూడెం అభివృద్ధిపై ప్రజల ప్రశ్నలు ఎన్నికల రిసెప్షన్ సెంటర్ ను పరిశీలించిన కలెక్టర్ కృతిక శుక్ల ఎన్నికల ఈవీఎంల గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌ కళ్యాణదుర్గంలో వైసీపీకి జలక్‌.. జనసేనలోకి ముఖ్య నాయకులు.. జిల్లా అధ్యక్షుడు టి.సి. వరుణ్ సమక్షంలో జనసేనలో చేరికలు పట్టభద్రులకు సువర్ణావకాశం - ఉచిత ఓటర్ నమోదు - సత్యవరపు సంపూర్ణ *రామన్నగూడెం గ్రామంలో అవగాహన సదస్సు - ఎస్హెచ్ఓ సాయి కిశోర్ రెడ్డి* బూర్గులకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు ఒకే వ్యక్తి రెండు పార్టీల తరపున నామినేషన్ పై అభ్యంతరం కృత్రిమ మేధస్సు దుర్వినియోగం ఆదోళనకరం -జాతీయ సదస్సులో వీసీ టాటా నర్సింగరావు|

బూర్గులకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు

Select Suryaa Now
బూర్గులకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు

తొలి విడతగా రూ.10 కోట్లు విడుదల…

*పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఇంగ్లీష్ మీడియం విద్య అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్…

ఫరూక్ నగర్, రంగారెడ్డి:

 హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు స్వగ్రామమైన బూర్గులకు ప్రభుత్వం ప్రతిష్టాత్మక తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను మంజూరు చేసిందని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తేెలిపారు. శినివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాఠశాల ఏర్పాటుకు తొలి విడతగా రూ.10 కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 20 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల అభివృద్ధి పనుల కోసం రూ.205.95 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు అయ్యాయని, ఇందులో భాగంగా బూర్గులకు రూ.10 కోట్లు రావడం గర్వకారణమని అన్నారు.

"ప్రజల మేలు కోసం పదవినే త్యాగం చేసిన మహోన్నత నేత బూర్గుల రామకృష్ణారావు. ఆయన స్వగ్రామ అభివృద్ధి, కీర్తిని ఇనుమడింపజేయడం మన బాధ్యత. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నా ఇంగ్లీష్ మీడియం కోసం తల్లిదండ్రులు ప్రైవేటు బాట పడుతున్నారు. ఈ వ్యత్యాసాన్ని తొలగించి గ్రామీణ పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఆంగ్ల మాధ్యమ విద్యను అందించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ స్కూళ్లను ఏర్పాటు చేస్తోంది" అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి ఆరుట్లలో ప్రారంభించిన పబ్లిక్ స్కూల్‌ను సర్పంచ్ రాంగోపాల్ రెడ్డి, మండల, బ్లాక్ నాయకులు స్వయంగా వెళ్లి పరిశీలించి, అదే స్థాయిలో బూర్గులలో నిర్మాణం జరిగేలా కృషి చేయాలని సూచించారు. పనులను వేగవంతం చేసి త్వరగా విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని అధికారులను కోరారు.

బూర్గులకు పాఠశాల మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బూర్గుల సర్పంచ్ చింటూ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్, మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, కాంగ్రెస్ నాయకులు పురుషోత్తం రెడ్డి, బాలరాజ్ గౌడ్, రాయికల్ శ్రీనివాస్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.