BREAKING
ఎల్‌నినోపై ముందస్తు హెచ్చరికలు భయపెట్టడం కాదు.. ప్రజలను అప్రమత్తం చేయడమే సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నోజిగూడ బొడ్రాయి ప్రతిష్టాపనకు సబితా ఇంద్రారెడ్డికి ఆహ్వానం కౌంటింగ్ కేంద్రంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి విజయ డంక మోగిస్తాం...! సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ తో ఎమ్మెల్యే చర్చ అక్రమ నీటి దందాపై హైడ్రా ఉక్కుపాదం గండిగూడెం అభివృద్ధిపై ప్రజల ప్రశ్నలు ఎన్నికల రిసెప్షన్ సెంటర్ ను పరిశీలించిన కలెక్టర్ కృతిక శుక్ల ఎన్నికల ఈవీఎంల గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌ కళ్యాణదుర్గంలో వైసీపీకి జలక్‌.. జనసేనలోకి ముఖ్య నాయకులు.. జిల్లా అధ్యక్షుడు టి.సి. వరుణ్ సమక్షంలో జనసేనలో చేరికలు పట్టభద్రులకు సువర్ణావకాశం - ఉచిత ఓటర్ నమోదు - సత్యవరపు సంపూర్ణ *రామన్నగూడెం గ్రామంలో అవగాహన సదస్సు - ఎస్హెచ్ఓ సాయి కిశోర్ రెడ్డి* బూర్గులకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు ఒకే వ్యక్తి రెండు పార్టీల తరపున నామినేషన్ పై అభ్యంతరం కృత్రిమ మేధస్సు దుర్వినియోగం ఆదోళనకరం -జాతీయ సదస్సులో వీసీ టాటా నర్సింగరావు|

కృత్రిమ మేధస్సు దుర్వినియోగం ఆదోళనకరం -జాతీయ సదస్సులో వీసీ టాటా నర్సింగరావు|

Select Suryaa Now
కృత్రిమ మేధస్సు దుర్వినియోగం ఆదోళనకరం -జాతీయ సదస్సులో వీసీ టాటా నర్సింగరావు|

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కృత్రిమ మేధస్సు దుర్వినియోగం ఆందోళన కలిగిస్తోందని వీసీ టాటా నర్సింగరావు పేర్కొన్నారు. ఎస్వీయూ రాజనీతి, ప్రభుత్వ పరిపాలన శాస్త్ర విభాగం, పూర్వ విద్యార్థుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సెనేట్ హాల్లో పీజీ, పరిశోధక విద్యార్థుల కోసం ప్రజాస్వామ్య పరిపాలనలో ఆవిర్భవిస్తున్న వినూత్న ధోరణులు, కృత్రిమ మేధస్సు, ప్రభుత్వ పరిపాలన, పోలీసు వ్యవస్థ, న్యాయ పాలన సమ్మిళిత అభివృద్ధి అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఏఐ దుర్వినియోగంతో డిజిటల్ అరెస్టులు, సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కృత్రిమ మేధస్సు సాఫ్ట్వేర్ రంగంలోని ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపుతున్నప్పటికీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ద్వారా అనేక నూతన అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. ప్రతి రంగంపైనా ప్రభావం చూపుతున్న కృత్రిమ మేధస్సును విద్యార్థులు నిర్లక్ష్యం చేయకూడదని, దాని వినియోగంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం కీలకోపన్యాసకులుగా హాజరైన జార్ఖండ్ రాష్ట్రం రాంచీ మానవ హక్కుల విభాగం పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ గడిదేసి క్రాంతి కుమార్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న అభివృద్ధి పోలీసు వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోందని పేర్కొన్నారు. పరస్పర అనుసంధానంతో నేర, న్యాయ వ్యవస్థ ద్వారా పోలీసు శాఖ, న్యాయస్థానాలు, జైళ్లు, ఫోరెన్సిక్ విభాగాలు, ప్రాసిక్యూషన్ వ్యవస్థల మధ్య సమన్వయం సాధ్యమవుతుందని వివరించారు. దర్యాప్తు ప్రక్రియల్లో ఉపయోగపడే కృత్రిమ మేధస్సు, వాటి ప్రధాన అనువర్తనాలు, వివిధ సాంకేతిక సాధనాలను ఆయన వివరించారు. ఈ సదస్సులో సంచాలకులు, నిర్వహణ కార్యదర్శి ప్రొఫెసర్ బీవీ మురళీధర్, హైదరాబాద్ హైకోర్టు న్యాయవాది పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు డాక్టర్ కె సాంబమూర్తి, సదస్సు సహ సంచాలకులు డాక్టర్ ఐఎస్ కిషోర్, డాక్టర్ సిఎల్ చెన్నారెడ్డి, తిరుపతి జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్, డిస్టిలరీస్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ ఎన్ బాలకృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సీఎంగౌడ్  తిరుపతి స్టాప్ రిపోర్టర్