BREAKING
ఎల్‌నినోపై ముందస్తు హెచ్చరికలు భయపెట్టడం కాదు.. ప్రజలను అప్రమత్తం చేయడమే సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నోజిగూడ బొడ్రాయి ప్రతిష్టాపనకు సబితా ఇంద్రారెడ్డికి ఆహ్వానం కౌంటింగ్ కేంద్రంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి విజయ డంక మోగిస్తాం...! సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ తో ఎమ్మెల్యే చర్చ అక్రమ నీటి దందాపై హైడ్రా ఉక్కుపాదం గండిగూడెం అభివృద్ధిపై ప్రజల ప్రశ్నలు ఎన్నికల రిసెప్షన్ సెంటర్ ను పరిశీలించిన కలెక్టర్ కృతిక శుక్ల ఎన్నికల ఈవీఎంల గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌ కళ్యాణదుర్గంలో వైసీపీకి జలక్‌.. జనసేనలోకి ముఖ్య నాయకులు.. జిల్లా అధ్యక్షుడు టి.సి. వరుణ్ సమక్షంలో జనసేనలో చేరికలు పట్టభద్రులకు సువర్ణావకాశం - ఉచిత ఓటర్ నమోదు - సత్యవరపు సంపూర్ణ *రామన్నగూడెం గ్రామంలో అవగాహన సదస్సు - ఎస్హెచ్ఓ సాయి కిశోర్ రెడ్డి* బూర్గులకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు ఒకే వ్యక్తి రెండు పార్టీల తరపున నామినేషన్ పై అభ్యంతరం కృత్రిమ మేధస్సు దుర్వినియోగం ఆదోళనకరం -జాతీయ సదస్సులో వీసీ టాటా నర్సింగరావు|

యువనేత బొమ్మిరెడ్డి తారక్ రెడ్డి ముమ్మర ప్రచారం

Select Suryaa Now
యువనేత బొమ్మిరెడ్డి తారక్ రెడ్డి ముమ్మర ప్రచారం

యువ నేత బొమ్మిరెడ్డి తారక్ రెడ్డి ముమ్మర ప్రచారం 
--అడుగడుగునా అఖండ స్వాగతం, విశేషప్రజాదరణ 
ఆత్మకూరు, మేజర్ న్యూస్, సోమా వెంకటసుబ్బయ్య :
బొమ్మిరెడ్డి వంశ యువ నేత, బి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్, దివంగత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి మనుమడు, దివంగత  నేత డాక్టర్ బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తనయుడు,  ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ కూటమి ఆధ్వర్యంలోని తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా తనయుడు బొమ్మిరెడ్డి తారకనాథరెడ్డి ప్రచారంలో దూసుకెళుతున్నారు. శనివారం ఆయన పట్టణంలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం ఆయా వార్డుల కౌన్సిల్ అభ్యర్థులతో కలిసి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అశేష జనం ఆయనకు అఖండ స్వాగతం పలికి మంగళ హారతులు ఇస్తూ శాలువాలు పూలమాలలతో సన్మానాలు చేస్తూ స్వాగతం పలికి విశేషంగా ఆదరించారు.రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆశీస్సులతో ఆయన ఆహ్వానం మేరకు తెలుగుదేశంలో చేరి వైద్య సేవలతో పాటు ప్రజాక్షేత్రంలో ప్రజా సేవలు కూడా అందించాలన్న లక్ష్యంతో ఆత్మకూరు అభివృద్ధి ఏకైక అజెండాగా డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా పోటీ చేస్తున్నారని ఆమెను అందరూ ఆదరించి ఆశీర్వదించి ఓట్లు వేసి విజయం చేకూర్చాలని తారకనాథరెడ్డి ఇంటింటికి వెళ్లి అందర్నీ కోరారు. ఆయన ప్రచారంలో విశేష స్పందన లభించింది. అన్ని వర్గాల నుండి అశేష ప్రజాదరణ లభించింది. బొమ్మిరెడ్డి కుటుంబం అందించిన, అందిస్తున్న వైద్య సేవలు, సామాజిక సేవలు, ప్రజాసేవలను అందరూ గుర్తు చేసుకుంటూ ఆత్మకూరు మున్సిపాలిటీ అనూహ్యంగా అభివృద్ధి పరుస్తున్న ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో బొమ్మిరెడ్డి షకీలా నాయకత్వంలో ఆత్మకూరు మున్సిపాలిటీ మరింతగా అభివృద్ధి చెందగలదని సర్వత్ర అభిప్రాయపడుతూ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల తెలుగుదేశం మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థులు, తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు  తదితరులు పాల్గొన్నారు.