BREAKING
కోస్తాంధ్రకు హైఅలర్ట్.. కాకినాడ - నర్సాపురం మధ్య తీరం దాటనున్న తుఫాన్! అభివృద్ధి అంటే జీజేఎంకే సాధ్యం - 52వ వార్డులో 45 లక్షలతో రెండు సిమెంట్ రోడ్లు పూర్తి, మరో రెండుకు శంకుస్థాపన - మేయర్ అభ్యర్థి కటారి హేమలత గెలుపు కోసం ' యువ కార్పొరేటర్ పీఎస్ చందు ఇంటింటి ప్రచారం కూటమి అభ్యర్థి వెంకట సాయి ని ఆశీర్వదించండి.. 21వ డివిజన్లో భవాని రవికుమార్, దేవానంద్ విస్తృత ప్రచారం కరువు ప్రమాదం పొంచి ఉంది కొత్త బోర్లకు అడ్డుకట్ట వేసేది ఎవరు? నేడు ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి.. రేపు మహారాష్ట్ర సీఎంతో కీలక భేటీ! మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి....! సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డి ​ట్రాన్స్‌ఫార్మర్‌ను కమ్మేసిన పిచ్చి మొక్కలు కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా పనిచేయాలి.. టి సి వరుణ్.. పాతూరులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం దర్శి మున్సిపాలిటీ ఏకగ్రీవం.చైర్మన్ గా దారం సుబ్బారావు ఎన్నిక. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా.. జీడబ్ల్యూఎంసీ కఠిన నిర్ణయం! అనాధ వృద్ధులు దివ్యాంగులకు బాలవికాస అండ వైసీపీని వీడి టిడిపిలో చేరిన 30 మంది యువకులు...! ప్రతి గ్రామం అభివృద్ధి లక్ష్యం. మంత్రి దాతలతో నిర్మించిన భవనాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోవాలి

అక్రమ నీటి దందాపై హైడ్రా ఉక్కుపాదం

Select Suryaa Now
 అక్రమ నీటి దందాపై హైడ్రా ఉక్కుపాదం
 
హైదరాబాద్: మాదాపూర్‌లోని సున్నం చెరువు చుట్టూ దశాబ్దాలుగా సాగుతున్న అక్రమ నీటి దందాపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) శనివారం ఉదయం ఉక్కుపాదం మోపింది. స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన అధికారులు, చెరువు పరిసరాల్లోని బస్తీ ఇళ్లలో గుట్టుచప్పుడు కాకుండా బోర్లు వేసి, భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేస్తున్న వ్యవహారాన్ని ఛేదించారు. రెవెన్యూ, జిహెచ్‌ఎంసి, జీహెచ్‌ఎంసీ ఆస్తి సంరక్షణ విభాగాల అధికారుల సమక్షంలో, భారీ పోలీసు బందోబస్తు మధ్య జేసీబీల సహాయంతో 10కి పైగా బోర్ కనెక్షన్లు మరియు నివాసాల నుంచి అనుసంధానించిన భారీ పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను అధికారులు పూర్తిగా ధ్వంసం చేసి తొలగించారు. ప్రైవేటు వాటర్ ట్యాంకర్ల ద్వారా భూగర్భ జలాలను అక్రమంగా తోడేస్తూ వాటర్ మాఫియా సాగిస్తున్న వ్యాపారానికి ఈ చర్యలతో ముగింపు పలికారు.