కళ్యాణదుర్గంలో వైసీపీకి జలక్.. జనసేనలోకి ముఖ్య నాయకులు.. జిల్లా అధ్యక్షుడు టి.సి. వరుణ్ సమక్షంలో జనసేనలో చేరికలు
అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్ :-కళ్యాణదుర్గం పట్టణంలో వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు జనసేన పార్టీలో చేరారు. జనసేన జిల్లా అధ్యక్షుడు, అహుడ చైర్మన్ టి.సి. వరుణ్ సమక్షంలో శనివారం అనంతపురం రాంనగర్ కార్యాలయంలో ఈ చేరికలు జరిగాయి. జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య, కళ్యాణదుర్గం నియోజకవర్గ జనసేన పీఓసీ బాల్యం రాజేష్ ఆధ్వర్యంలో నాయకులు జనసేనలో చేరారు.ఈ సందర్భంగా టి.సి. వరుణ్ నూతనంగా పార్టీలో చేరిన నాయకులకు జనసేన కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరినట్లు నాయకులు తెలిపారు.పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని వారు ప్రకటించారు. ఈ చేరికలతో కళ్యాణదుర్గం ప్రాంతంలో జనసేన పార్టీ కార్యకలాపాలకు మరింత ఊతం లభించనుందని పార్టీ నాయకులు పేర్కొన్నారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్