BREAKING
సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ తో ఎమ్మెల్యే చర్చ అక్రమ నీటి దందాపై హైడ్రా ఉక్కుపాదం గండిగూడెం అభివృద్ధిపై ప్రజల ప్రశ్నలు ఎన్నికల రిసెప్షన్ సెంటర్ ను పరిశీలించిన కలెక్టర్ కృతిక శుక్ల ఎన్నికల ఈవీఎంల గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌ కళ్యాణదుర్గంలో వైసీపీకి జలక్‌.. జనసేనలోకి ముఖ్య నాయకులు.. జిల్లా అధ్యక్షుడు టి.సి. వరుణ్ సమక్షంలో జనసేనలో చేరికలు పట్టభద్రులకు సువర్ణావకాశం - ఉచిత ఓటర్ నమోదు - సత్యవరపు సంపూర్ణ *రామన్నగూడెం గ్రామంలో అవగాహన సదస్సు - ఎస్హెచ్ఓ సాయి కిశోర్ రెడ్డి* బూర్గులకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు ఒకే వ్యక్తి రెండు పార్టీల తరపున నామినేషన్ పై అభ్యంతరం కృత్రిమ మేధస్సు దుర్వినియోగం ఆదోళనకరం -జాతీయ సదస్సులో వీసీ టాటా నర్సింగరావు| యువనేత బొమ్మిరెడ్డి తారక్ రెడ్డి ముమ్మర ప్రచారం రెండో టీ20లో ఘోరారంభం: 4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్.. భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ కృష్ణ స్విమర్స్ నూతన అధ్యక్షుడిగా పిన్నెల్లి పాండురంగారావు సమాజ హితానికి ముందుండండి గీతం రోటరాక్ట్ క్లబ్ సభ్యులకు ప్రముఖుల ఉద్బోధ

పంచాయతీ కార్యదర్శి రవిపై కలెక్టర్‌ సస్పెన్షన్‌ వేటు

Select Suryaa Now
పంచాయతీ కార్యదర్శి రవిపై కలెక్టర్‌ సస్పెన్షన్‌ వేటు

పంచాయతీ కార్యదర్శి రవిపై కలెక్టర్‌ సస్పెన్షన్‌ వేటు

-అక్రమ నిర్మాణాలు, రికార్డుల అవకతవకలపై చర్యలు

-అక్టోబర్‌ 15న ఉత్తర్వులు.. ఆలస్యంగా వెలుగులోకి

 

సిద్దిపేట రూరల్ : నారాయణరావుపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి జె. రవికుమార్‌పై జిల్లా కలెక్టర్‌ కె. హైమావతి సస్పెన్షన్‌ వేటు వేశారు. గ్రామంలో అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు చేపట్టడం, పంచాయతీ రికార్డుల్లో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి ఈ చర్యలు తీసుకున్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోవడం, ఇంటి నంబరు, పన్ను రసీదులు, నో డ్యూస్‌ సర్టిఫికెట్‌ జారీకి సంబంధించిన అవకతవకలను ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. ఈ మేరకు అక్టోబర్‌ 15న సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ కాగా, విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. క్రమశిక్షణ విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్‌ కొనసాగనుంది.

(సూర్య రూరల్, రమేష్)