పోలీసులకు వ్యాసరచన పోటీలు
సూర్య జగిత్యాల ప్రతినిధి:పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీసు అధికారులు, సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించారు.పోలీసు సిబ్బందిలో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడం, సామాజిక బాధ్యతను గుర్తుచేయడం, ప్రజాసేవ పట్ల నిబద్ధతను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజానుకూల పోలీసింగ్‌పై అవగాహన కల్పించడం ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.ఈ పోటీలను రెండు విభాగాలుగా నిర్వహించారు. మొదటి విభాగంలో భాగంగా పోలీస్ కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఏఎస్ఐ) హోదా వరకు ఉన్న సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) సిబ్బందికి పలు అంశాలను కేటాయించారు.రెండో విభాగంలో భాగంగా సబ్‌ఇన్‌స్పెక్టర్, రిజర్వ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆపై హోదాల్లో ఉన్న అధికారులకు పలు అంశాలను కేటాయించారు.